Breaking News

చంద్రబాబుపై రంగా హత్య రక్తపు మరకలు!

Published on Thu, 07/20/2023 - 05:20

పాలకొల్లు సెంట్రల్‌ : విపక్షాల ఓట్లు చీలకుండా చేయడం వల్ల జనసేన అభ్యర్థులను కొంతవరకూ గెలిపించుకునే అవకాశాలున్నా టీడీపీతో పొత్తు వల్ల పలు నష్టాలున్నాయని కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు చేగొండి హరిరామజోగయ్య పేర్కొన్నారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో టీడీపీపై అవినీతి, కుల ముద్రతో పాటు ఆయనపై రంగా హత్య ఉదంతం రక్తపు మరకలు అలాగే ఉన్నాయన్నారు.

చంద్రబాబుకు వయోభారం, లోకేశ్‌కు అనుభవరాహిత్యం, ప్రధాని మోదీకి బద్ధ శత్రువుగా మిగలడం, కాపు రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లోపించడం, బీసీలకు జనాభా ప్రాతిపదికపైన రిజర్వేషన్ల డిమాండ్‌పై స్పందించకపోవడం లాంటి వాటివల్ల చివరకు జనసేనకు నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. జనసేన కనీసం 75 సీట్లలో పోటీ చేసి 50 సీట్లు కైవసం చేసుకుంటే గౌరవప్రదమైన అధికారాన్ని పొందవచ్చని జోగయ్య పేర్కొన్నారు.

చంద్రబాబుకు పూర్తి కాలం అధికారాన్ని అప్పగిస్తే పవన్‌పై వస్తున్న ప్యాకేజీ ఆరోపణలు నిజమేనని భావించే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు రాజకీయ విశ్లేషణ పేరుతో చేగొండి బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలో గత ఎన్నికల్లో బీజేపీకి ఒక్క శాతం లోపు మాత్రమే ఓట్లు రాగా జనసేనతో పొత్తు వల్ల రెండు శాతం పెరగవచ్చన్నారు. సీఎం జగన్‌ను ఓడించేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అంతంత మాత్రమే అని పేర్కొన్నారు. కేంద్రంతో సీఎం జగన్‌కు ఉన్న సత్సంబంధాలే దీనికి కారణమన్నారు.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)