Breaking News

Sandeshkhali: షాజహాన్‌ను సీబీఐకి అప్పగించిన బెంగాల్‌ పోలీసులు

Published on Wed, 03/06/2024 - 15:48

పశ్చిమ బెంగాల్‌లోని ‘సందేశ్‌ఖాలీ’ అరాచకాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన సస్పెండెడ్‌ టీఎంసీ నేత షాజహాన్‌ షేక్‌ను కస్టడీకి అప్పగించే విషయంలో బెంగాల్‌ ప్రభుత్వం, సీబీఐ మధ్య రసవత్తర రాజీకీయం నడుస్తోంది. తాజాగా షాజహాన్‌ను సీబీఐకి అప్పగించేందుకు బెంగాల్‌ పోలీసులకు కలకత్తా హైకోర్టు కొత్త డెడ్‌లైన్‌ విధించింది 

సందేశ్‌ఖాలీ కేసుపై జస్టిస్‌లను హరీష్‌ టండన్‌, హిరన్మయి భట్టాచర్యాలతో కూడా ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా షాజహాన్‌ను నేటి సాయంత్రం 4.15 నిమిషాల వరకు సీబీఐకి అప్పగించాల్సిందేనని ఆదేశించింది. సీఐడీపై కోర్టు ధిక్కారం నమోదు చేయాలని సీబీఐ కోరిన నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో సీబీఐ అధికారులు బెంగాల్‌ పోలీసు హెడ్‌క్వార్టర్‌కు చేరుకున్నారు. ఎట్టకేలకు షాజహాన్‌ను పోలీసులు సీబీఐకి అప్పజెప్పారు.

ఇక ఈ కేసులో షాజహాన్‌ షేక్‌ను సీబీఐకి అప్పగించాలంటూ కలకత్తా హైకోర్టు మంగళవారమే ఆదేశాలు ఇచ్చింది. కానీ దీనిని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం లెక్కచేయలేదు. అతడిని అప్పగించబోమని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ అధికారులు కోల్‌కతాలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లగా.. షాజహాన్‌ను అప్పగించేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో సీబీఐ అధికారులు అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయారు.
చదవండి: Rajasthan : డబుల్‌ జీరో! కాంగ్రెస్‌ ‘సున్నా’ రాత మారేనా?

అనంతరం సీబీఐ మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. మంగళవారం నాటి ఆదేశాలపై సుప్రీం ఎటువంటి స్టే ఇవ్వలేదని.. అయినా రాష్ట్ర ప్రభుత్వం షాజహాన్‌ షేక్‌ను అప్పగించడం లేదని ఈడీ చెప్పడంతో నేటి సాయంత్రానికి నిందితుడు షాజహాన్‌ షేక్‌ను అప్పగించి తీరాల్సిందేనని హైకోర్టు డెడ్‌లైన్‌ విధించింది.

కాగా గత కొంతకాలంగా సందేశ్‌ఖాలీ పేరు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. టీఎంసీ నేత షాజహాన్‌ షేక్‌  ఇంట్లో సోదాలు చేసేందుకు వెళ్లిన ఈడీ అధికారులపై అతడి అనుచరులు దాడి చేశారు. అనంతరం అతడు స్థానికుల నుంచి భూములు లాక్కోవడం, ఇవ్వని పక్షంలో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆకృత్యాలపై, టీఎంసీ గుండాలకు వ్యతిరేకంగా అక్కడి మహిళలు రోడ్డెక్కారు. ఈ ఉద్యమానికి బీజేపీతో సహా ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చాయి.

ఈ నేపథ్యంలో జనవరి 5 నుంచి షేక్ షాజహాన్ పరారీలో ఉన్నాడు. దాదాపు 55 రోజుల తర్వాత గవర్నర్, హైకోర్టు అల్టిమేటంతో బెంగాల్‌ పోలీసులు ఇతడిని అరెస్ట్ చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వమే షాజహాన్‌ని కాపాడుతోందని బీజేపీ విమర్శిస్తోంది. ఈ వివాదం పెద్దది కావడంతో టీఎంసీ అతడిని 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. ఇతడికి బెయిల్ ఇచ్చేందుకు కూడా హైకోర్టు నిరాకరిస్తూ.. అతడిపై తమక సానుభూతి లేదని ప్రకటించింది.

Videos

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)