Breaking News

ముందు ప్యాకేజీ తేల్చండి

Published on Sat, 06/29/2024 - 15:41

సాక్షి ప్రతినిధి, గుంటూరు, తాడేపల్లి రూరల్‌: అమ­రావతిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణం కోసం రైతులతో సీఆర్‌డీఏ ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన రైతులు, ఇతర రైతుల మధ్య వివాదం చెలరేగడంతో సమావేశం వాయిదా పడింది. భూసేకరణకు ప్యాకేజీ ఎంత ఇస్తారో తే ల్చిన తర్వాతే ముందుకు వెళ్లాలని రైతులు కరాఖండిగా చెప్పడంతో సీఆర్‌డీఏ అధికారులు సమావేశాన్ని వాయిదా వేశారు. 

గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణం కోసం భూ సేకరణకు నోటీసులు ఇవ్వగా భూములు కోల్పోయే రైతులు హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకువచ్చారు. దీంతో రోడ్డు నిర్మాణం నిలిచిపోయింది. మళ్లీ కూటమి అధికారంలోకి రావడంతో సీడ్‌ యాక్సెస్‌ రోడ్లు నిర్మాణానికి సీఆర్‌డీఏ సన్నద్ధమవుతోంది. దీనిలో భాగంగా శనివారం ఉండవల్లి సచివాలయం–2లో రోడ్డు నిర్మాణంలో పొలాలు కోల్పోయే రైతులతో సీఆర్‌డీఏ డిప్యూటీ కలెక్టర్‌ విశ్వేశ్వర నాయుడు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ఆరంభంలోనే రైతులు సీఆర్‌డీఏ అధికారులను నిలదీశారు. 

ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ముందుగా ఎందుకు తెలియజేయలేదని, ఒక్క పేపరు ప్రకటన ఇస్తే సరిపోతుందా అంటూ నిలదీశారు. ముందుగానే సమాచారం ఇచ్చామని డిప్యూటీ కలెక్టర్‌ విశ్వేశ్వరనాయుడు చెప్పారు. రోడ్డు కోసం రైతుల భూములను సర్వే చేస్తామని, అనంతరం మరోసారి సమావేశం ఏర్పాటు చేసి మిగిలిన విషయాలు మాట్లాడుకుందామని ఆయన చెబుతుండగా రైతులు తిరగబడ్డారు. సర్వే కాదని, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద రైతులకు ఎంత ప్రకటిస్తారో ముందుగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

అంతలో అక్కడే ఉన్న తెలుగుదేశం పార్టీ రైతు సంఘం నాయకుడు దాసరి కృష్ణ కల్పించుకొని, మనకు రాజధాని వద్దు, మన భూములు ఇవ్వవద్దు.. గత ప్రభుత్వంలో రైతులకు కౌలు కూడా ఇవ్వనప్పుడు  ఎవరూ మాట్లాడలేదంటూ వాగ్వాదానికి దిగారు. దాంతో మిగతా రైతులు ఆయనపై తిరగబడ్డారు. గత ప్రభుత్వంలో కరకట్ట విస్తరణకు భూ సేకరణ నోటీసు ఇస్తే దానిని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించామని, సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, కరకట్ట విస్తరణ రెండింటి మీదా హైకోర్టు స్టే ఇచ్చిందని, మాకు ఏ ప్రభుత్వమైనా ఒకటేనని, రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

గుంటూరు – విజయవాడ మహా నగరాల మధ్య ఉన్న వారికి, ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్నవారికి ఒకే ప్యాకేజీ ఇవ్వడం ఎంతవరకు న్యాయమని రైతులు ప్రశ్నించారు. ఈ క్రమంలో తెలుగుదేశం రైతు సంఘం నాయకులు,  ఇతర రైతుల మధ్య వివాదం చెలరేగింది. పలువురు రైతులు మాట్లాడుతూ తాము నష్టపోవడానికి సిద్ధంగా లేమని, సీఎం చంద్రబాబు, మంగళగిరి ఎమ్మెల్యే లోకేశ్‌తో సమావేశం ఏర్పాటు చేస్తే మా కష్టాలు తెలుపుతామని అన్నారు. 

మళ్లీ టీడీపీ రైతు సంఘం నాయకులు కల్పించుకోవడంతో సమావేశం రసాభాసగా మారింది. దీంతో సీఆర్‌డీఏ అధికారులు సమావేశాన్ని వాయిదా వేశారు. తదుపరి సమావేశానికి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో  భూములు కోల్పోయే రైతులు మాత్రమే హాజరు కావాలని డిప్యూటీ కలెక్టర్‌ విశ్వేశ్వరనాయుడు స్పష్టం చేశారు. 

Videos

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)