Breaking News

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోదరుడు అరెస్ట్‌.. కారణం ఇదే..

Published on Fri, 03/15/2024 - 07:13

సాక్షి, పటాన్‌చెరు: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.

వివరాల ప్రకారం.. గూడెం మధుసూదన్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా, పరిమితికి మించి అక్రమ మైనింగ్ చేశారని తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో మధుసూదన్‌ రెడ్డిపై చీటింగ్, మైనింగ్‌కు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

కాగా, సంతోష్‌ గ్రానైట్‌ మైనింగ్‌ పేరుతో మధుసూదన్‌ రెడ్డి క్రషర్‌ కంపెనీలు నిర్వహిస్తున్నాడు. నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని లీజ్‌కు తీసుకుని మరో నాలుగు ఎకరాల్లో అక్రమంగా క్రషింగ్‌ నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో, పరిమితికి మించి గుట్టల్ని తవ్వేస్తున్నారని మైనింగ్‌ కూడా నివేదిక ఇచ్చింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ శాఖ నిబంధనలు పాటించకపోవడంతో క్రషర్లను అధికారులు సీజ్‌ చేశారు. అనంతరం, మధుసూదన్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇక, మధుసూదన్‌ అరెస్ట్‌తో పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌ వద్దకి భారీగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో, స్టేషన్‌ ఎదుట పోలీసులు మోహరించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)