Breaking News

యువ వైద్యులకు అండ‌గా ఉంటాం: గోపిరెడ్డి

Published on Wed, 07/02/2025 - 18:18

సాక్షి, తాడేపల్లి: ఫారెన్ మెడిక‌ల్‌ గ్రాడ్యుయేష‌న్‌ ప‌రీక్ష పాసై, ఇంట‌ర్న్‌ షిప్ కూడా పూర్తి చేసుకున్న యువ వైద్యులకు ప‌ర్మినెంట్ రిజిస్ట్రేష‌న్ చేయ‌కుండా కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వేధింపులకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అన్ని అర్హతలతో వైద్యవిద్యను పూర్తి చేసుకుని, సమాజంలో వైద్యులుగా సేవలందించేందుకు సిద్దంగా ఉన్న వారికి 13 నెలలుగా పీఆర్ చేయకపోవడం దుర్మార్గం కాదా అని నిలదీశారు.

తమకు న్యాయం చేయాలని ప్రశ్నించినందుకు రెడ్‌బుక్ రాజ్యాంగం మేరకు యువ వైద్యులను పై పోలీసులను ప్రయోగించి, అరెస్ట్‌లు చేయడం కూటమి ప్రభుత్వ దివాలాకోరుతనంకు నిదర్శనమని మండిపడ్డారు. యువ వైద్యులకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని, ఈ ప్రభుత్వ మెడలు వంచైనా సరే వారికి పీఆర్ వచ్చే వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..

కూట‌మి ప్ర‌భుత్వంలో వేధింపుల‌కు ఎవ‌రూ అతీతం కాద‌ని తేలిపోయింది. వాళ్లూ వీళ్లూ అని తేడా లేకుండా అన్ని వ‌ర్గాల‌ను వేధించి ప‌రాభ‌విస్తున్నారు. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న యువ వైద్యులకు ప‌ర్మినెంట్ రిజిస్ట్రేష‌న్ చేయ‌కుండా ఇబ్బంది పెడుతున్నారు. వారంతా ప్ర‌భుత్వంపై శాంతి యుతంగా నిర‌స‌న‌కు దిగితే ఈడ్చి పారేశారు. ఉన్న‌త చ‌దువులు చ‌దివి ప్ర‌జాసేవ చేయ‌డానికి సిద్ధంగా ఉన్న వారిని 'డాక్ట‌ర్స్ డే' అని కూడా చూడ‌కుండా పోలీస్ స్టేష‌న్‌కి తీసుకెళ్లి ఈ ప్రభుత్వం అవ‌మానించింది.

పేద కుటుంబాల నుంచి వ‌చ్చి ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కోర్చి వైద్య విద్య‌న‌భ్య‌సించ‌డంతోపాటు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంట‌ర్న్‌షిప్ పూర్తి చేసిన వారికి ప‌ర్మినెంట్ రిజిస్ట్రేష‌న్ చేయ‌కండా వేధించ‌డానికి ప్ర‌భుత్వానికి మ‌న‌సెలా ఒప్పిందో అర్థం కావ‌డం లేదు. అన్ని రాష్ట్రాల్లో ఇంట‌ర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఏడాదే ఉంటే ఏపీలో మాత్రం మూడేళ్ల‌పాటు చేయాల‌నే నిబంధ‌న పెట్టి వేధిస్తున్నారు. ఇంట‌ర్న్‌షిప్ చేసిన వారిని రిలీవ్ చేయ‌డం లేదు. ప‌క్క రాష్ట్రాల్లో రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న వారు సొంతంగా ప్రాక్టీస్ మొద‌లుపెట్ట‌డ‌మో, కార్పొరేట్ ఆస్ప‌త్రుల్లో ప‌నిచేయ‌డ‌మో లేదా పీజీలు రాసుకుంటున్నారు.

కానీ ఒక్క ఏపీలో మాత్ర‌మే ఇంట‌ర్న్‌షిప్ చేసిన దాదాపు 1500 మందికి పైగా విద్యార్థులు ఇబ్బంది ప‌డుతున్నారు. త‌మ స‌మస్య‌ల‌ను తెలియ‌ప‌ర్చ‌డానికి హెల్త్ యూనివ‌ర్సిటీకి వ‌చ్చి వైద్యారోగ్యశాఖ మంత్రిని క‌లిస్తే ఆయ‌న వారి ప‌ట్ల అవ‌మాన‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారు. దీంతో మెడిక‌ల్ విద్యార్థులు శాంతియుతంగా త‌మ నిర‌స‌న తెలియ‌జేయడానికి పూనుకుంటే వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్‌కి త‌ర‌లించారు. తమ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ యువ వైద్యులు ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌ని క‌లిశారు. వారికి వైఎస్సార్సీపీ అండ‌గా ఉంటుంద‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని వైఎస్సార్సీపీ సీరియ‌స్‌గా తీసుకుని వారికి న్యాయం చేసేదాకా పోరాడుతుంది.

వైద్య రంగంపై చంద్రబాబు నిర్లక్ష్యం
రాష్ట్రంలో మొత్తం వైద్య రంగాన్నే చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నాడు. సీఎంగా వైఎస్‌ జగన్ తీసుకువచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం, సీట్లు అక్కరలేదని కేంద్రానికి లేఖ రాయడం, నిర్మాణ పనులను అర్థాంతరంగా ఆపేయించడం వంటి చర్యలతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్ధుల వైద్య విద్య ఆశలపై నీళ్ళు కుమ్మరించారు. ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లో ఎంబీబీయ‌స్ డాక్ట‌ర్లు, పీజీ డాక్ట‌ర్లను నియ‌మించుకోకుండా ఎలా వైద్యం అందించాల‌నుకుంటున్నారో అర్థం కావడం లేదు. వైఎస్సార్సీపీ పాల‌న‌లో  వైద్యారోగ్య‌శాఖ‌లో ఐదేళ్ల‌లో 54 వేలమంది నియామ‌కం జ‌రిగితే అందులో డాక్ట‌ర్లే 3800 మంది ఉన్నారు.

మెడిక‌ల్ కాలేజీల్లో స్టాఫ్ లేరంటూ వైద్యం నిరాక‌రిస్తున్నారు. వైద్య విద్య పూర్తిచేసుకుని వ‌చ్చిన వారికి రిజిస్ట్రేష‌న్లు చేయ‌కుండా వేధిస్తున్నారు. ప్ర‌ణాళిక ప్ర‌కారం ప్ర‌భుత్వ వైద్య‌రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర‌కు కూట‌మి ప్ర‌భుత్వం తెర‌దీసింది. ఆయుష్మాన్ భార‌త్‌లో కలిపే పేరుతో ఆరోగ్య‌శ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. వైఎస్సార్సీపీ హ‌యాంలో ఒక్క రూపాయి లేకుండా ఆప‌రేష‌న్లు జ‌రిగితే ఇప్పుడు కూట‌మి పాల‌న‌లో యూజ‌ర్ చార్జీల పేరిట రోగుల‌ను దోచుకుంటున్నారు.

కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన నాటి నుంచి ఆరోగ్య‌శ్రీ బిల్లులు పెండింగ్ పెట్ట‌డంతో దిక్కుతోచ‌ని స్థితిలో కోపేమెంట్‌ల పేరుతో వసూలు చేసి ఆస్ప‌త్రుల‌ను న‌డిపించుకోవాల్సిన ప‌రిస్థితి ఆస్ప‌త్రి యాజమాన్యాలది. ప్ర‌భుత్వం ఆరోగ్య‌శ్రీ పెండింగ్ బిల్లులు చెల్లించ‌క‌పోతే రాబోయే రోజుల్లో వైయ‌స్సార్సీపీ త‌ర‌ఫున ఉద్యమిస్తాం. ప్ర‌భుత్వం మెడ‌లు వంచుతాం.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)