Breaking News

స్మృతితో రాహుల్‌ ఎందుకు పోటీ పడలేదు?.. గెహ్లాట్ వివరణ!

Published on Sun, 05/12/2024 - 08:39

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గం 2024- లోక్‌సభ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా ఏళ్లుగా కాంగ్రెస్‌, రాహుల్‌ గాంధీలకు కంచుకోటగా ఉన్న ఈ స్థానం ఆ తరువాత బీజేపీకి దక్కింది. ఇక్కడి నుంచి స్మృతి ఇరానీ ఎంపీ అయ్యారు. ఈసారి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తిరిగి అమేథీ నుంచి పోటీ చేయనున్నారనే ప్రచారం గతంలో జోరుగా సాగినా అది కార్యరూపం దాల్చలేదు. కాంగ్రెస్ హైకమాండ్ స్మృతి ఇరానీ  ఎదుట కేఎల్ శర్మను తమ అభ్యర్థిగా ప్రకటించింది. రాహుల్ గాంధీకి రాయ్ బరేలీ స్థానాన్ని అప్పగించింది. అదిమొదలు బీజేజీ ప్రతిపక్ష పార్టీపై మాటల దాడి చేస్తూనే ఉంది. స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఎందుకు పోటీకి దిగలేదంటూ ప్రశ్నిస్తోంది.

దీనికి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సమాధానం ఇచ్చారు. కేఎల్ శర్మ 40 ఏళ్లుగా కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నారని, గాంధీ కుటుంబం ఆధ్వర్యంలో పగలు రాత్రి పనిచేసిన శర్మను అమేథీ అభ్యర్థిగా ఎంపిక చేయడంలో తప్పేముంది? రాహుల్ గాంధీనే అమేథీకి ఎందుకు వెళ్లాలని, కేఎల్ శర్మ  సరిపోతారని గెహ్లాట్ అన్నారు.

రాహుల్ గాంధీని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయించాలని పార్టీ భావించిందని, అక్కడ రాహుల్‌ గెలుస్తారని అన్నారు. అమేథీలో కెఎల్ శర్మ విపక్షాలను ఎదుర్కొంటారని పేర్కొన్నారు. శర్మ అటు పార్టీ కోసం ఇటు ప్రజల కోసం పనిచేస్తున్నారని తెలిపారు. సోనియా గాంధీ కూడా  శర్మను మెచ్చుకున్నారని, అతనికి అమేథీ ప్రజల సమస్యల గురించి తెలుసని, అక్కడి సమస్యల పరిష్కారానికి ఆయన ఒక ప్రణాళిక రూపొందించారని గెహ్లాట్‌ వివరించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)