Breaking News

బీజేపీతో భేటీకి గౌతమ్ అదానీ హాజరు..?: ఫడ్నవీస్‌ క్లారిటీ

Published on Fri, 11/15/2024 - 20:47

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వేడి ముదురుతోంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా రాష్ట్ర రాజకీయాలు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ చుట్టూ తిరుగుతున్నాయి. మహారాష్ట్రలో  మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం కూలిపోవడానికి అదానీయే కారణమంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. 

అంతేగాక 2019లో అదానీ తన ఢిల్లీ నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారని, బీజేపీ- ఎన్సీపీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కోరారని శరర్‌ పవార్‌ ఆరోపించారు. ఈ సమావేశానికి తనతోపాటు, అమిత్‌ షా, తన మేనల్లుడు అజిత్‌ పవార్‌, అదానీ హాజరైనట్లు తెలిపారు.

అయితే ఆ ఆరోపణలను తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఖండించారు. గౌతమ్ అదానీ తన నివాసంలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించినట్లు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. గతంలో అదానీ తమ సమావేశాలకు ఎప్పుడూ హాజరు కాలేదని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం చర్చించేందుకు ఫడ్నవీస్, అమిత్ షాలతో సహా బీజేపీ అగ్రనేతలు, శరద్ పవార్, ప్రఫుల్ పటేల్ సహా ఎన్సీపీకి చెందిన నేతలంతా అదానీ ఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన చర్చల్లో భాగమయ్యారని అజిత్ పవార్ కూడా ఆరోపించారు.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)