Breaking News

పూల సాగుతో నాలుగు నెలల్లో రూ. 8 లక్షలు!

Published on Mon, 04/01/2024 - 11:29

ఇటీవలి కాలంలో యువత కేవలం ఉద్యోగాలపైనే ఆధారపడకుండా స్టార్టప్‌లతో పాటు వ్యవసాయరంగంలోనూ కాలుమోపి, విజయాలు సాధిస్తున్నారు. యూపీలోని లక్నోలో గల మలిహాబాద్‌ పరిధిలోని ధాక్వా గ్రామానికి చెందిన గౌరవ్ కుమార్  ఇలాంటి విజయాన్నే అందుకున్నాడు. ప్రస్తుతం 22 ఏళ్ల వయసు కలిగిన గౌరవ్‌ కుమార్‌ గ్లాడియోలస్ పూలు సాగు చేస్తున్నాడు. నాలుగు నెలల్లో రూ. ఎనిమిది లక్షలు సంపాదించి అందరినీ ఆశ్యర్యపరుస్తున్నాడు. 

గౌరవ్‌ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి శివకుమార్ వరి, గోధుమలు పండించి చాలాసార్లు నష్టపోయాడని, ప్రతికూల వాతావరణం కారణంగా పంట పాడైపోయేదని తెలిపాడు. అటువంటి పరిస్థితిలో తాను సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సబ్‌ట్రాపికల్ హార్టికల్చర్‌లో చేరానన్నాడు. అక్కడ పూల పెంపకం గురించి తెలుసుకుని, పూల సాగుకు తండ్రిని ఒప్పించానని తెలిపాడు. 

సెప్టెంబరు నుంచి గ్లాడియోలస్ పూల సాగు ప్రారంభమవుతుందని, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు ఈ పూలు విరివిగా లభిస్తాయని తెలిపాడు. కేవలం నాలుగు నెలల్లోనే ఈ పూల విక్రయం ద్వారా నాలుగు నుంచి ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం వస్తుందని గౌరవ్‌ తెలిపాడు. తాను ప్రస్తుతం  డీ ఫార్మా  చదువుతున్నానని, వైద్య విద్యతో పాటు వ్యవసాయంపై దృష్టి సారిస్తానని తెలిపారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)