Breaking News

గాలి జనార్థన్‌రెడ్డిపై సోదరుడు సోమశేఖర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Published on Sun, 04/23/2023 - 18:14

బళ్లారి: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గాలి జనార్థన్‌రెడ్డిపై సోదరుడు సోమశేఖర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి బళ్లారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సోమశేఖర్‌రెడ్డి.. తనదే విజయం అని స్పష్టం చేశారు. గాలి జనార్థన్‌రెడ్డి భార్య బరిలోకి దిగుతున్నప్పటికీ విజయం మాత్రం తనదేని నొక్కి చెప్పారు సోమశేఖర్‌రెడ్డి. గాలి జనార్థన్‌రెడ్డి పేరు అక్కడక్కడ వినిపిస్తున్నా, ఆయన పబ్లిక్‌తో ఎటువంటి సంబంధాలు లేవన్నారు. పబ్లిక్‌తో ఉండేది తానేనని సోమశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. అదే తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

గతంలో తామంతా గాలి జనార్థన్‌రెడ్డి ఉన్పామని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు సోదరుడు సోమశేఖర్‌రెడ్డి. పక్కా కార్యకర్తలంతా తమతోనే ఉన్నారని, అది తన గెలుపునకు దోహదం చేస్తుందన్నారు. డబ్బులకు ఆశ పడే వాళ్లు మాత్రమే గాలి జనార్థన్‌రెడ్డి వైపుకు వెళ్తున్నారని, నిజమైన కార్యకర్తలు మాత్రం తమ పార్టీ వెంటే ఉన్నారన్నారు.

ఇదిలా ఉంచితే, గాలి జనార్థన్‌రెడ్డి స్థాపించిన కళ్యాణ రాజ్య ప్రగతిపక్ష(కేఆర్‌పీ)పార్టీ తరఫున ఆయన భార్య అరుణ లక్ష్మి పోటీ చేస్తున్నారు. కాగా, కర్నాటక ఎన్నికలకు సంబంధించి కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అధ్యక్షుడు గాలి జనార్ధన్ రెడ్డి స్పందించారు. కర్నాటక ఎన్నికల్లో మేమే కీలకం కాబోతున్నాం. 25 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మా రాజకీయ ప్రత్యర్ధులు బీజేపీ - కాంగ్రెస్. బసవేశ్వర సిద్ధాంతాలే మా అజెండా. కులాలు, మతాలకు అతీతంగా సేవ చేసేందుకే రాజకీయ పార్టీ స్థాపించాను’ అని అన్నారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి