Breaking News

కాంగ్రెస్‌ నాకు టికెట్‌ ఇవ్వాల్సిందే.. గద్దర్‌ కూతురు వెన్నెల

Published on Sat, 10/21/2023 - 16:15

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రజా గాయకుడు గద్దర్‌ కూతురు వెన్నెల కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉంటానని తెలిపారు. కాంగ్రెస్‌ అవకాశం ఇస్తే కంటోన్మెంట్‌ నుంచి పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. 

కాగా, వెన్నెల శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ నా పేరును పరిశీలిస్తోంది. టికెట్‌ విషయంలో చాలా మంది నన్ను అడుగుతున్నారు. అందుకే మీ అందరికీ క్లారిటీ ఇస్తున్నాను. కంటోన్మెంట్‌లో పుట్టి పెరిగాను. ఇక్కడి నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తాను. గద్దర్‌ కూతురుగా మీ ముందుకు వస్తున్నాను. ఓట్ల విప్లవం రావాలని గద్దర్‌ అన్నారు. అందుకే చివరగా కాంగ్రెస్‌ పార్టీకి ఆయన మద్దతుగా నిలిచారు. గద్దరు ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు. కానీ, అకాల మరణం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇదే సమయంలో గద్దర్‌ భార్య విమల గద్దర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ నేతలు మాకు టికెట్‌ ఇస్తామన్నారు. కానీ, ఇప్పుడు వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. అందుకే నేను కాంగ్రెస్‌ పార్టీని అడుగుతున్నాను. నా కూతురు వెన్నెలకు టికెట్‌ ఇవ్వండి. వెన్నెలను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారు అని అన్నారు. ఇదిలా ఉండగా, ప్రజా గాయకుడు గద్దర్‌ ఇటీవల అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. ఇక, గద్దర్‌కు కాంగ్రెస్‌ పార్టీతో రాజకీయంగా మంచి అనుబంధమే ఉంది. కాంగ్రెస్‌ను ప్రజలు మళ్లీ​ గెలిపించాలని గద్దర్ పలు సందర్భాల్లో కూడా తెలిపారు. 

ఇది కూడా చదవండి: ఢిల్లీలో కవిత ధర్నాల సంగతేంటి.. బీఆర్‌ఎస్‌పై ఎంపీ లక్ష్మణ్‌ ఫైర్‌

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)