Breaking News

మునుగోడు బరిలో గద్దర్‌.. ఆ పార్టీ నుంచే పోటీ!

Published on Fri, 10/07/2022 - 07:51

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాగాయకుడు గద్దర్‌ ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధిగా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక బరిలో దిగనున్నారు. గద్దర్‌ను ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించామని, ఆహ్వానాన్ని మన్నించి తమ పార్టీలోకి వచ్చారని, ఆయనను మునుగోడు అభ్యర్థిగా ఖరారు చేశామని ఆ పార్ట అధినేత కేఏ పాల్‌ ప్రకటించారు.

బుధవారం ఇక్కడ అమీర్‌పేట అపరాజిత కాలనీలోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో మీడియాతో కేఏ పాల్‌ మాట్లాడారు. ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్న తనతో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రజాశాంతి పార్టీ తరఫున ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నారు. నోటు తీసుకుని ఓటు వేయడం రాజ్యాంగం ప్రకారం నేరమని, ఇదే విషయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.

నోటు తీసుకోకుండా నచ్చిన అభ్యర్థికి ఓటు వేయండనే నినాదంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం, మద్దతు కోసం వెంటనే ప్రచారం ప్రారంభిస్తామని తెలిపారు. ఉన్నత విలువలు కలిగి తెలంగాణ సమాజం కోసం తన జీవితాన్ని ధారపోస్తున్న గద్దర్‌ తమ పార్టీలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గద్దర్‌ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

కాగా, ఈ నెల 2న జరగాల్సిన ప్రపంచశాంతి సభకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను కేఏ పాల్‌ విరమించారు. ఆయనకు గద్దర్‌ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.  

చదవండి: (KCR BRS Party: 'బీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో పోటీ చేయించబోం') 

Videos

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో బిగ్ అప్‌డేట్

జోహార్ చంద్రబాబు.. జోహార్ లోకేష్.. గంటా కొడుకు అత్యుత్సాహం

బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం

పసి మనసులను చంపేస్తోన్న వివాహేతర సంబంధాలు

ఎల్లో మీడియా వేషాలు

Photos

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)