Breaking News

ముగ్గురికే పట్టం

Published on Mon, 06/09/2025 - 01:38

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రులుగా గడ్డం వివేక్‌ వెంకటస్వామి (చెన్నూరు), అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ (ధర్మపురి), వాకిటి శ్రీహరి ముదిరాజ్‌ (మక్తల్‌)లు ప్రమాణ స్వీకారం చేశారు. ఊహించినట్టుగానే ఈ దఫాలో ఈ ముగ్గురికే మంత్రులుగా అవకాశం లభించింది. ఆదివారం మధ్యాహ్నం 12:13 నిమిషాలకు రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో ముగ్గురు మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సరిగ్గా 9 నిమిషాల్లో ముగిసింది. 

జాతీయ గీతాలాపన అనంతరం తొలుత వివేక్‌ వెంకటస్వామి, ఆ తర్వాత అడ్లూరి లక్ష్మణ్, అనంతరం వాకిటి శ్రీహరిల చేత గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ ప్రమాణం చేయించారు. దైవ సాక్షిగానే వివేక్‌ ఇంగ్లిష్‌లో, మిగిలిన ఇద్దరు తెలుగులో ప్రమాణం చేశారు. ఈ ముగ్గురిని గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌రెడ్డిలు పూలబొకేలు ఇచ్చి అభినందించారు. ప్రమాణ స్వీకారం అనంతరం మరోమారు జాతీయగీతాలాపనతో 12:22 నిమిషాలకు ప్రమాణ కార్యక్రమం ముగిసింది. 

నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ జి ప్రసాద్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, కొత్త మంత్రుల కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకార అనంతరం గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌రెడ్డిలు, కేబినెట్‌ మంత్రులు గ్రూప్‌ ఫొటో దిగారు.  

రాజ్‌భవన్‌లో వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్‌తో మంత్రులుగా ప్రమాణం చేయిస్తున్న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ. చిత్రంలో సీఎం రేవంత్‌  

మరో మూడు బెర్తులు ఖాళీగానే... 
కొత్తగా ముగ్గురు ప్రమాణం చేయడంతో రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల సంఖ్య 15కు చేరింది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, మరో 11 మంది కేబినెట్‌లో ఉన్నారు. వీరికి తోడు మరో ముగ్గురు కొత్తగా మంత్రులు కాగా, ఇంకా మూడు బెర్తులు ఖాళీగానే ఉండిపోయాయి. ఈ మూడు బెర్తులను కూడా వీలున్నంత త్వరలోనే భర్తీ చేయాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలిసింది. 



స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం రెండో దఫా కేబినెట్‌ విస్తరణ ఉంటుందనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. కాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన సరిగ్గా సంవత్సరం ఏడు నెలల తర్వాత విస్తరణకు ముహూర్తం కుదిరింది. 2023, డిసెంబర్‌ 7న సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కాగా, మళ్లీ 2025, జూన్‌ 8న తొలిదఫా విస్తరణ జరిగింది. అదిగో.. ఇదిగో అంటూ పలుమార్లు వాయిదా పడిన అనంతరం ఎట్టకేలకు ముగ్గురిని కేబినెట్‌లో తీసుకునేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం గమనార్హం.    

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)