Breaking News

బీఆర్‌ఎస్‌కు మాజీ ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి రాజీనామా 

Published on Sun, 03/24/2024 - 02:54

సాక్షి ప్రతినిధి నల్లగొండ: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి శనివారం ఆ పారీ్టకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపించారు. నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించిన రోజే ఆయన రాజీనామా చేయ డం గమనార్హం. రాజీనామా లేఖలో ఈనెల 18న రాజీనామా చేసినట్లు పేర్కొనగా, చిన్నపరెడ్డి ఈ రోజే రాజీనామా చేశారని, టైపింగ్‌ ఎర్రర్‌ వల్ల అలా వచ్చిందని ఆయన అనుచరులు పేర్కొన్నారు. నల్ల గొండ ఎంపీ అభ్యర్థిగా చిన్నపరెడ్డిని బరిలో నిల పాలని మొదట్లో బీఆర్‌ఎస్‌ భావించింది.

అయితే ఆయన బీజేపీకి టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరగడంతో చిన్నపరెడ్డి పేరును పక్కన పెట్టింది. కానీ తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని, టికెట్‌ తనకే వస్తుందని చిన్నపరెడ్డి రెండ్రోజుల కిందట చెప్పారు. బీఆర్‌ఎస్‌ అధిష్టానం అనూహ్యంగా కంచర్ల కృష్ణారెడ్డి పేరును ప్రకటించింది. బీజేపీ అధిష్టానం హుజూర్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పేరును ప్రకటించింది. 15 రోజులు గడవక ముందే ఆయన్ను మార్చి చిన్నపరెడ్డికి టికెట్‌ ఇస్తారన్న చర్చ కూడా సాగుతోంది. కంచర్ల కృష్ణారెడ్డికి నల్లగొండ ఎంపీ టికెట్‌ ఇవ్వడాన్ని నిరసిస్తూ నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ మండల స్థాయి నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)