Breaking News

ఆప్‌ ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌ ఆనంద్‌పై అనర్హత వేటు

Published on Fri, 06/14/2024 - 20:08

సాక్షి, ఢిల్లీ: ఆప్‌ ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌ ఆనంద్‌పై అనర్హత వేటు పడింది. బీఎస్పీ తరపున ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన రాజ్‌కుమార్‌.. విచారణకు హాజరుకావాలని స్పీకర్‌ ఆదేశించారు. విచారణకు హాజరుకాకపోవడంతో రాజ్‌కుమార్‌ అసెంబ్లీ సభ్యత్వంపై అనర్హత వేటు వేసినట్టు స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ శుక్రవారం తెలిపారు. 

జూన్ 11న  విచారణకు హాజరుకావాలని నోటీస్‌ ఇచ్చినా కానీ ఆయన హాజరుకాలేదని గోయెల్ పేర్కొన్నారు. మరోసారి జూన్ 14న హాజరుకావాలని ఆదేశించినా స్పందించలేదన్నారు. ఈ క్రమంలో ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసినట్టు స్పీకర్ తెలిపారు.

'ఆప్' సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వంలో పలు మంత్రిత్వ శాఖలను రాజ్‌కుమార్‌ ఆనంద్ నిర్వహించారు. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దళితులకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ.. గత ఏప్రిల్‌లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీని కూడా వీడారు. ఆప్‌లోని దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు, కౌన్సిలర్లకు ఎలాంటి గౌరవం ఇవ్వడం లేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. గత మేలో బీఎస్పీలో చేరారు. బీఎస్పీ తరఫున ఎంపీ ఎన్నికల్లో రాజ్‌కుమార్‌ పోటీ చేశారు.

 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)