Breaking News

‘ వివాదాస్పదంగా జిల్లా కలెక్టర్‌ నిర్ణయాలు’

Published on Thu, 01/23/2025 - 13:38

నెల్లూరు:   జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి(Kakani Govardhan Reddy) ధ్వజమెత్తారు. రెడ్‌ క్రాస్‌ వ్యవహారంలో అధికార పార్టీ నేతల ఆదేశాలను కలెక్టర్‌ పాటిస్తున్నారని విమర్శించారు.

రెడ్‌ క్రాస్‌(Red Cross) ప్రాథమిక సభ్యత్వం నుంచి వైఎస్సార్‌సీపీ(YSRCP) సానుభూతి పరులను తొలగించే అధికారం కలెక్టర్‌కి లేదని స్పష్టం చేశారు.  ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడిన కాకాణి.. కలెక్టర్‌ హోదాలో కూర్చొనే అర్హత ఆనంద్‌ కి ఉందో లేదో ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ జాతీయ చైర్మన్‌ గా బీజేపీ(BJP) ఎంపీనే ఉన్నారని,  రాజకీయ నేతలు ఉండకూడదనే నిబంధన ఎక్కడా లేదన్నారు కాకాణి.

ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని,  రెడ్‌క్రాస్‌ వివాదాస్పదం కాకూడదనే  చైర్మన్‌ పదవికి చంద్రశేఖర్‌రెడ్డి రాజీనామా చేశారని, రెడ్‌ క్రాస్‌ విలువ పెంచేలా ఆయన వ్యవహరించారన్నారు.

‘రెడ్ క్రాస్ హాస్పిటల్ అభివృద్ధి చెందడానికి కారకులు mlc చంద్రశేఖర్ రెడ్డి అని, ఉచితంగా సేవలు అందిస్తున్న రెడ్‌ క్రాస్‌ని మంత్రి నారాయణ వాడుకుని సొమ్ము చేసుకోవాలని ూచూస్తున్నారు. మంత్రి నారాయణకి అడ్డుగా ఉన్న చంద్రశేఖర్‌రెడ్డిని కావాలనే తొలగించారు. రెడ్‌ క్రాస్‌ విషయంలో గత కలెక్టర్లకు రాని ఇబ్బంది, ఇప్పుడు కలెక్టర్‌కి ఏమొచ్చిందో అర్థం కావడం లేదు. రెడ్‌ క్రాస్‌ ద్వారా టీడీపీ నేతలే సేవల చెయ్యాలనే ఆలోచనలో కలెక్టర్‌ ఆనంద్‌ ఉన్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుల సభ్యత్వాన్ని రద్దు చేయడంపై న్యాయపోరాటం చేస్తాం’ అని ఆయన తెలిపారు.

వైఎస్సార్‌సీపీ వారి సభ్యత్వమే రద్దు చేయడం దారుణం

రెడ్‌ ్క్రాస్‌ సంస్థలో వైఎస్సార్‌సీపీ సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి తప్పుబట్టారు. నెల్లూరు రెడ్‌ క్రాస్‌లో ఐదు వేల మంది సభ్యత్వం ఉంటే వాటిలో 90 శాతం మంది పొలిటికల్‌ ాపార్టీ వారే ఉన్నారని, కానీ వైఎస్సార్‌సీపీ వారికి మాత్రమే సభ్యత్వం రద్దు చేయడం ాదారుణమన్నారు. మంత్రి నారాయణకు రెడ్‌ క్రాస్‌ మీద అవగాహన లేదని, కాబట్టే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.

ఆయన కనీసం ఇందులో సభ్యత్వం కూడా తీసుకోలేదన్నారు. నారాయణ మెడికల్‌ కాలేజ్‌ లోకీలకంగా ఉండే విజయ్‌ కుమార్‌ అనే వ్యక్తిని రెడ్‌ క్రాస్‌ లోమెంబర్‌గా చేర్చి, దాన్ని నాశనం చేయాలని మంత్రి చూస్తున్నారన్నారు. మంత్రి నారాయణ అనుచరులతో కొత్త బాడీని ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆనంద్‌ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు చంద్రశేఖర్‌రెడ్డి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)