Breaking News

ప్రజలు ‘సూపర్‌సిక్స్‌’ కోసం చూస్తున్నారు: బొత్స

Published on Sat, 10/19/2024 - 16:41

సాక్షి,విశాఖపట్నం: సూపర్‌సిక్స్‌ హామీల అమలుకు ముహూర్తం ఎప్పుడని మాజీ మంత్రి,వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. శనివారం(అక్టోబర్‌ 19) మరో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తో కలిసి విశాఖపట్నంలో బొత్స మీడియాతో మాట్లాడారు.

‘ఎన్నికల హామీల అమలును కూటమి ప్రభుత్వం విస్మరించింది. సూపర్‌ సిక్స్‌ హామీల అమలు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో సామాన్యులకు ఇసుక దొరకడం లేదు. విశాఖలో రూ.10వేలు, విజయనగరంలో రూ.7 వేలకు ఇసుక దొరకాలి. ఇప్పుడు దొరుకుతోందా? ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందిపడుతున్నారు’అని బొత్స మండిపడ్డారు.

బొత్స ఇంకా ఏమన్నారంటే..

  • ప్రభుత్వానికి హామీలపై ఆరు నెలలు సమయం ఇద్దమనుకున్నాం.
  • ఆరు నెలల తర్వాత కూడా ఇచ్చిన హామీల అమలులో  కూటమి ప్రభుత్వం విఫలమైంది.
  • ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారు.
  • సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు.
  • రెండున్నర ఏళ్లు మాత్రమే అధికారంలో ఉంటుందని చంద్రబాబు చెపుతున్నారు.
  • వైఎస్సార్‌సీపీ పాలనలో పది వేల రూపాయాలకు వచ్చే ఇసుక నేడు 15 వేల లభిస్తుంది.
  • ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పినా కూడా గత ప్రభుత్వం కంటే ఎక్కువ ధరకు ఇసుక అమ్ముతున్నారు.
  • గత ప్రభుత్వ హయాంలో సినరేజ్ చార్జీలు రూ.375 వసూలు చేసేవారు.
  • సినరేజ్ డబ్బులు ప్రభుత్వానికి ఆదాయ రూపంలో వచ్చేవి.
  • కూటమి ప్రభుత్వం టన్నుకు 375 రూపాయలు సినరేజ్ వసూలు చేయకపోయినా టన్ను ఇసుక రేటు తగ్గలేదు.
  • ట్రాక్టర్‌తో ఉచిత ఇసుక అనేది గత ప్రభుత్వ హయాంలో కూడా ఇచ్చేవారు.
  • టీడీపీ ప్రభుత్వం హయంలో కొత్తగా ఏమీ ఇవ్వలేదు.
  • మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పారు, ఎక్కడ తగ్గించారు.
  • నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటాయి.
  • తల్లికి వందనం, రైతు భరోసా ఒక్కరికైన ఇచ్చారా.
  • ఖరీఫ్ ముగుస్తున్నా ఒక్క పైసా రైతు ఖాతాల్లో పడలేదు.
  • అగ్గిపెట్టెలకు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు.
  • ప్రభుత్వ అవినీతిపై వార్తలు రాస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు.
  • అగ్గి పెట్టె లెక్కలు మీ గెజిట్ పేపర్‌లోనే వచ్చాయి.
  • టీడీపీ నేతల కుమ్ములాటలు వల్ల గుర్లలో పది మంది చనిపోయారు.
  • నాలుగు నెలల నుంచి మంచి నీటిపై పర్యవేక్షణ లేదు.
  • మంచినీటి సరఫరా కాంట్రాక్టు తమకు ఇవ్వాలంటే తమకు ఇవ్వాలని కుమ్మూలడుకుంటున్నారు.
  • ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలి.
  • ప్రభుత్వ నిర్లక్ష్యం వలన డయేరియా మరణాలు సంభవించాయి.
  • పరిశుభ్రమైన మంచి నీటిని అందించలేదు.
  • డయేరియాతో చనిపోయిన పది మందికి నష్ట పరిహారం చెల్లించాలి.

ఇదీ చదవండి: ఇసుక,మద్యంలో కూటమి నేతల అవినీతి: కాకాణి

 

 

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)