Breaking News

Maharashtra: అనిల్‌ దేశ్‌ముఖ్‌ కారుపై రాళ్ల దాడి.. మాజీ మంత్రి తలకు గాయాలు

Published on Tue, 11/19/2024 - 06:55

ముంబై, సాక్షి: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో మాజీ మంత్రి, ఎన్సీపీ (ఎస్పీ) నేత అనిల్ దేశ్‌ముఖ్ కారుపై రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్లదాడిలో అనిల్ దేశ్‌ముఖ్‌కు తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనను నాగ్‌పూర్ పోలీసులు ధృవీకరించారు. నాగ్‌పూర్‌లోని కటోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో  ఈ ఘటన చోటుచేసుకుంది.

అనిల్ దేశ్‌ముఖ్ కుమారుడు సలీల్ దేశ్‌ముఖ్ కటోల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. కుమారుడి తరఫున అనిల్‌ ప్రచారానికి వెళ్లారు. కటోల్ జలల్‌ఖేడా రోడ్డులో తన కారుపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారని ఎన్‌సీపీ- ఎస్‌సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్ ఆరోపించారు.  గాయపడిన అనిల్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోంది. 

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు దాడి చేసిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. నాగ్‌పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్) హర్ష్ పొద్దార్ ఈ ఘటనను ధృవీకరించారు. ప్రస్తుతం అనిల్ దేశ్‌ముఖ్ బెయిల్‌పై ఉన్నారు. 2021లో అవినీతి ఆరోపణలతో అనిల్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర హోం మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. నవంబర్ 2021లో అనిల్‌ అరెస్టయ్యారు. డిసెంబర్ 2022లో బెయిల్‌పై విడుదలయ్యారు.

Credits: Lokmat Times Nagpur

288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే దశలో నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, బీజేపీ, అజిత్ పవార్‌తో కూడిన ఎన్‌సీపీల మహాయుతి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షమైన శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ (ఎస్పీ), కాంగ్రెస్‌ల మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఎన్నికల్లో తమ సత్తాను చాటేందుకు ప్రయత్నిస్తోంది.

ఇది కూడా చదవండి: మోదీజీ.. సవాల్‌ చేస్తున్నా కమిటీని పంపండి!: సీఎం రేవంత్‌

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)