Breaking News

బీజేడీకి షాక్‌.. రాజీనామా చేసిన సీనియర్‌ ఎమ్మెల్యే

Published on Sat, 03/02/2024 - 14:29

భువనేశ్వర్‌: పార్ల‍మెంట్‌ ఎన్నికలు, ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిజూ జనతా దళ్‌(బీజేడీ) నేతలు ఆ పార్టీకి షాక్‌ ఇస్తున్నారు. తాజాగా ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన అరబింద ధాలి శనివారం అధికార బీజేడీ పార్టీకి రాజీనామా చేశారు. అయిన బీజేపీ చేరనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అరబింద ధాలి కోరాధా జిల్లాలోని జయదేవ్‌ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ధాలి తన రాజీనామా పత్రాన్ని బీజేడీ అధ్యక్షుడు, సీఎం నవీన్‌ పట్నాయక్‌కు ఇ-మెయిల్‌ ద్వారా పంపారు. అయితే ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలను వెల్లడించలేదు. 

ధాలి మొదటిసారి 1992లో బీజేపీ టికెట్‌పై మల్కాక్‌గిరి ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం రెండు పర్యాయాలు ఆ స్థానంలోనే ధాలి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత ధాలి బీజేడీలో చేరారు. 2009లో ఆయన జయదేవ్‌ నియోజకవర్గంలో విజయం సాధించారు. గత 2019లో కూడా ఇదే నియోజకవర్గంలో బీజేడీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందారు.

నవీన్‌ పట్నాయక్‌ కేబినెట్‌లో ధాలి.. ట్రాన్స్‌పోర్టు మంత్రిగా పనిచేశారు. గత నెల.. బీజేడీ నుంచి బహిష్కరణకు గురైన ఇద్దరు ఎమ్మెల్యేలు పాణిగ్రాహి, ప్రశాంత్ జగదేవ్‌ ప్రతిపక్ష బీజేపీలో చేరారు. మాజీ రాష్ట్ర మంత్రి దేబాసిస్ నాయక్ సైతం ఇటీవల బీజేడీ నుంచి పార్టీ మారారు. ఒడిశాలో పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేతల రాజీనామాలు  బీజేడీకి తలనొప్పిగా మారింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)