Breaking News

బాబా సిద్దిఖీ హత్య కేసులో మరో ఐదుగురు అరెస్ట్‌

Published on Fri, 10/18/2024 - 18:45

ముంబై: ఎన్సీపీ నేత‌,మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. సిద్దిఖీ హ‌త్య‌కేసులో మ‌రో ఐదుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.  

సిద‍్ధిఖీ కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ తరుణంలో హత్య కేసులో నిందితులు రాయ్‌గఢ్ జిల్లాలోని పన్వెల్, కర్జాత్‌లలో ఉన్నట్లు శుక్రవారం పోలీసులకు సమాచారం అందింది. విశ్వసనీయ వర్గాల సమాచారంతో పోలీసులు ఏకకాలంలో దాడులు జరిపారు. ఈ దాడుల్లో నేరానికి సంబంధించిన కుట్ర, దాని అమలుకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసు అధికారి తెలిపారు.

అరెస్టయిన వ్యక్తులు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో కూడా టచ్‌లో ఉన్నారని అన్నారు. కాగా, ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది అరెస్ట్ అయ్యారని,  తదుపరి విచారణ జరుగుతోంది’ అని అన్నారు.

కార్యాలయంలో ఉండగా కాల్పుల కలకలం
ఎన్సీపీ (అజిత్‌ పవార్ వర్గం) సీనియర్‌ నేత, సల్మాన్‌ఖాన్‌ స్నేహితుడు బాబా సిద్ధిఖీ  హత్యకు గురికావడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. ముంబై బాంద్రాలో తన తనయుడు, ఎమ్మెల్యే జీషన్‌ సిద్ధిఖీ కార్యాలయంలో ఉండగా..ముగ్గురు దుండగులు బాబా సిద్ధిఖీపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం అత్యవసర చికిత్స నిమిత్తం లీలావతి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)