Breaking News

రామ్‌నాథ్ కోవింద్ కమిటీ మొదటి సమావేశంలో కీలకాంశాలు

Published on Wed, 09/06/2023 - 16:38

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నివాసంలో జమిలీ ఎన్నికలపై  జరుగుతున్న తొలి సమావేశం సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్,  న్యాయశాఖ కార్యదర్శి ఇతర నేతలు హాజరయ్యారు. 

'వన్ నేషన్ వన్ ఎలెక్షన్'పై అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ ఈరోజు మొదటిసరి అధికారికంగా సమావేశమయ్యింది. ఈ హైలెవెల్ కమిటీ సమావేశంలో ఏడు కీలక అంశాలపై చర్చించి సిఫారసులు చేయనుంది.  

రాజ్యాంగ సవరణలు: ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలించి.. అందుకు ఏయే రాజ్యాంగ అధికారణల సవరణలు చెయ్యాలో, ఏయే చట్టాల సవరణ చెయ్యాలో కమిటీ అధ్యయనం చేస్తుంది. 

రాష్ట్రాల అనుమతి: ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించడానికి ఏవైనా రాజ్యాంగ సవరణలు చేయాల్సి వస్తే వాటి సవరణకు రాష్ట్రాల ఆమోదం తప్పనిసరా? లేక కేంద్రమే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళవచ్చా అన్నదానిపై కూడా స్పష్టతనివ్వాలి.  

సంకీర్ణాలైతే : ఇక ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను కూడా అధ్యయనం చేసి హంగ్ అసెంబ్లీ, అవిశ్వాస తీర్మానం, ఫిరాయింపుల సమయంలో ఏం చేయాలనే దానిపై కూడా ఈ కమిటీ సూచనలు తెలియజేయాలి. 

సాధ్యం కాకపోతే: ఒకేసారి దేశమంతా ఎన్నికలు సాధ్యం కాని పక్షంలో, విడతలవారీగా ఎన్నికలను జరిపి సమ్మిళితం చేసే అవకాశం ఉందా లేదా అన్నదానిపై కమిటీ పూర్తి వివరాలను తెలియజేయాలి.  

భవిష్యత్తు : ఒకసారి పరిస్థితులు అనుకూలించి ఒకేసారి ఎన్నికల వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత, మళ్లీ ఇది దెబ్బ తినకుండా తదనంతరం కూడా కొనసాగడానికి అవసరమైన చర్యలపై కూడా సిఫారసులు చెయ్యాలి. 

సిబ్బంది:  ఒకేసారి ఎన్నికలకు ఈవీఎంలు, వివి ప్యాట్ల అవసరం ఎంత? వాటితో పాటు మానవ వనరుల అవసరమెంతో కూడా స్పష్టమైన నివేదిక సమర్పించాలి.  

ఒక్కటే ఓటర్ కార్డు: లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఒకటే ఓటరు జాబితా ఉండేలా చర్యలు తీసుకునే అంశమై ఎటువంటి కార్యాచరణను సిద్ధం చేసుకోవాలో తెలియజేయాలి. 

ఇది కూడా చదవండి: ఇండియా కంటే 'భారత్' మేలు: లాలూ ప్రసాద్ యాదవ్ 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)