Breaking News

ఎట్టకేలకు ఏపీ బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా

Published on Sun, 03/24/2024 - 19:03

సాక్షి, విజయవాడ: లోక్‌సభ అభ్యర్థులకు సంబంధించి బీజేపీ ఐదో జాబితాను విడుదల చేసింది. ఇందులో ఏపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్‌ చేసింది బీజేపీ అధిష్టానం. బీజేపీ 111 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో ఏపీ నుంచి ఆరు లోక్‌సభ స్థానాల అభ్యర్థులను ఖరారు చేసింది. అనకాపల్లి, అరకు, రాజమండ్రి, నరసాపురం,, రాజంపేట, తిరుపతి ఎంపి స్ధానాలకి అభ్యర్ధుల ఖరారయ్యారు.

తెలంగాణ నుంచి రెండు ఎంపీ స్థానాలకు సైతం అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ. వరంగల్‌ నుంచి ఆరూరి రమేష్‌, ఖమ్మం తాండ్ర వినోద్‌ రావులకు టికెట్లు కేటాయించింది. 


ఏపీ ఎంపీ స్ధానాలకు  ఖరారైన పేర్లు
అనకాపల్లి- సీఎం రమేష్
అరకు- కొత్తపల్లి గీత
రాజమండ్రి- పురందేశ్వరి
నరసాపురం-  శ్రీనివాస వర్మ
రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి
తిరుపతి-  మాజీ ఐఎఎస్ మరియు గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్

అసలైన బీజేపీ నేతలకు దక్కని సీట్లు 

ఇప్పటివరకూ పోటీలో ఉన్న అసలైన బీజేపీ నేతలు జీవీఎల్‌ నరసింహారావు, సోము వీర్రాజులకు కూడా టికెట్లు దక్కలేదు.  పొత్తు పేరుతో చంద్రబాబు కొత్త ఎత్తుగడలకు జీవీఎల్‌, పోము వీర్రాజులకు సీట్లు దక్కలేదు. బీజేపీలో  కూడా తమ వాళ్లకే సీట్లు వచ్చేలా చంద్రబాబు వ్యూహం రచించడంతో అసలైన బీజేపీ నేతలను పక్కన పెట్టేశారు. దీంతో బీజేపీకి సేవ చేసిన నేతలు ఈ జాబితా చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో చంద్రబాబుకు సాన్నిహిత్యంగా ఉన్నవారికి బీజేపీ టికెట్లు కేటాయించడంపై అసలైన బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక నర్సాపురం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ఆశించిన రఘురామకృష్ణం రాజుకు చుక్కదురైంది. రఘురామ కృష్ణం రాజుకు చంద్రబాబు మొండిచేయి చూపించగా,  అక్కడ ఎంపీ టికెట్‌ను శ్రీనివాస్‌ వర్మకు కేటాయించింది బీజేపీ

బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల ఐదో జాబితా కోసం క్లిక్‌ చేయండి

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)