Breaking News

రేపే లోక్‌సభ ఐదో దశ పోలింగ్‌.. అందరి చూపు వీళ్లపైనే!

Published on Sun, 05/19/2024 - 07:39

2024 లోక్‌సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్‌ మే 20న జరగనుంది. ఈ దశలో 8 రాష్ట్రాల్లోని 49 స్థానాలలో ఓటింగ్‌ జరగనుంది. పలువురు ప్రముఖులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 
  
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యూపీలోని లక్నో లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అతనిపై సమాజ్‌వాదీ పార్టీ రవిదాస్ మెహ్రోత్రాను తమ అభ్యర్థిగా నిలబెట్టింది. మంత్రిగా పనిచేసిన మెహ్రోత్రా ప్రస్తుతం లక్నో సెంట్రల్ అసెంబ్లీ స్థానానికి చెందిన ఎమ్మెల్యేగా ఉన్నారు.

  • రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఇక్కడి నుంచి దినేష్ ప్రతాప్ సింగ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీ కోసం తన సీటును వదులుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

  • భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని అమేథీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఇక్కడి నుంచి గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కేఎల్ శర్మను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నిలబెట్టింది.

  • చిరాగ్ పాశ్వాన్ బీహార్‌లోని హాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన ఎన్డీఏ కూటమిలోని ఎల్‌జేపీ (ఆర్‌)కి చెందిన  నేత. కాగా ఇదే స్థానం నుంచి శివచంద్ర రామ్‌ను ఆర్జేడీ తమ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దించింది.

  • ఒమర్ అబ్దుల్లా కాశ్మీర్‌లోని బారాముల్లా స్థానం నుంచి జమ్ముకశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ తరపున  ఎన్నికల బరిలోకి దిగారు. ఒమర్‌పై మెహబూబా ముఫ్తీ పార్టీ పీడీపీ నుంచి ఫయాజ్ అహ్మద్ పోటీకి దిగారు. గత ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి అక్బర్ లోన్ ఈ స్థానంలో విజయం సాధించారు.

  • ఐదో దశ ఎన్నికల పోరులో మోదీ ప్రభుత్వానికి చెందిన పలువురు మంత్రులు  రంగంలోకి దిగారు. ముంబై నార్త్ నుండి పీయూష్ గోయల్, మోహన్‌లాల్‌గంజ్ నుండి కౌశల్ కిషోర్, లక్నో నుండి రాజ్‌నాథ్ సింగ్, అమేథీ నుండి స్మృతి ఇరానీ, ఫతేపూర్ నుండి సాధ్వి నిరంజన్ జ్యోతి, దిండోరి నుండి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్, కోడెర్మా నుండి అన్నపూర్ణా దేవి, భివాండి నుండి కపిల్ పాటిల్ ఈ జాబితాలో ఉన్నారు.

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)