Breaking News

'కశ్మీర్‌కూ గాజా గతే..' ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు

Published on Tue, 12/26/2023 - 16:24

శ్రీనగర్: భారత్, పాకిస్థాన్‌లు చర్చల ద్వారా వివాదాలకు ముగింపు పలకకపోతే కాశ్మీర్‌కు గాజాకు పట్టిన గతే పడుతుందని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. పూంచ్‌ జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఇటీవల ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించారు. మరుసటి రోజు ఆర్మీ జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల నేపథ్యంలో ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

'మన స్నేహితులను మనం మార్చగలం. కాని మన పొరుగు వారిని మార్చలేమని అటల్ బిహారీ వాజ్‌పేయి చెప్పారు. మనం మన పొరుగువారితో స్నేహ పూర్వకంగా ఉంటే, ఇద్దరూ అభివృద్ధి చెందుతారు. ప్రస్తుతం యుద్ధం సరైన విధానం కాదు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ అన్నారు' అని గుర్తు చేశారు. 

'పాకిస్థాన్‌కు త్వరలో నవాజ్ షరీఫ్ ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇండియాతో చర్చలు జరపడానికి తాము సిద్ధమేనని ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ మనమే చర్చలకు సిద్ధంగా లేము. ఒకవేళ చర్చల్లో సరైన ఫలితం రాకపోతే.. కశ్మీర్‌కు గాజాకు పట్టిన గతే పడుతుంది.' అని ఫరూక్ అబ్దుల్లా హెచ్చరించారు.

భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే సోమవారం జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ, పూంచ్ జిల్లాలను సందర్శించారు. ఉగ్రవాదులకు రహస్య ప్రదేశాలుగా మారిన గుహలను కూల్చివేయాలని సైనికులను ఆదేశించారు. ఆ ప్రాంతంలో భద్రత ఏర్పాట్లను ఆయన సమీక్షించారు.

ఇదీ చదవండి: ఖర్గే పేరుతో ఇండియా కూటమిలో చీలిక?

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)