Breaking News

మహరాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్‌.. డిప్యూటీ సీఎంగా షిండే!

Published on Tue, 12/03/2024 - 15:19

ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం ఎంపికపై మహాయుతి కూటమి మధ్య గత పదిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లే కనిపిస్తోంది. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్‌ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ ఖాయమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‌నాథ్‌ షిండే డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. 

ఇక డిసెంబరు 5న మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం జరగనున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఈసారి కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండనుండగా.. షిండేతో పాటు ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ అదే రోజున ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

అయితే కేబినెట్‌ కూర్పు ఇంకా పూర్తి కాని కారణంగా.. ఆ రోజు సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు మాత్రమే ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. మరోవైపు  బుధవారం బీజేపీ శాసనసభాపక్ష నేతల సమావేశం జరగనుంది. ఇందులో కొత్త సీఎంను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. 

కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికూటమి భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. కూటమిలోని బీజేపీకి 132 సీట్లు, షిండే శివసేనకు 57, అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీకి 41 సీట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో అత్యధిక సీట్లు సాధించిన బీజేపీనే ఈసారి సీఎం పదవి చేపట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

కానీ సీఎం పదవి వదులుకునేందుకు ఏక్‌నాథ్‌ షిండే సుముఖంగా లేనట్లు శివసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ  క్రమంలోనే సీఎం పదవి, శాఖల కేటాయింపుపై మహాయుతి కూటమి మధ్య గత కొంతకాలంగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇక అనేక రోజుల చర్చల తర్వాత షిండే మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడానికి అంగీకరించినట్లు  తెలుస్తోంది.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)