Breaking News

బీఆర్‌ఎస్‌కు ఎగ్జిట్‌ పోల్స్‌ షాక్‌ !

Published on Thu, 11/30/2023 - 20:00

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్‌ ఘట్టం ముగిసింది. పోలింగ్‌ ముగిసిన వెంటనే ‍‍ప్రముఖ మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ను వెల్లడించాయి. మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌ ఇచ్చాయి. 90 శాతం ఎగ్జిట్‌ పోల్స్‌ గులాబీ పార్టీకి ఈ ఎన్నికల్లో నెగెటివ్‌ ఫలితాలే రానున్నాయని ప్రెడిక్ట్‌ చేశాయి. ఇదే సమయంలో ఒకటి రెండు సీట్లు అటుఇటుగా కాంగ్రెస్‌ పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌కు దగ్గరగా రానుందని చాలా వరకు సర్వేలు తెలిపాయి. బీజేపీకి 10 దాకా, ఎంఐఎంకు మళ్లీ 6 లేదా 7 సీట్లు రానున్నాయని వెల్లడించాయి. 

బీఆర్‌ఎస్‌కు 48 సీట్లే: సీఎన్‌ఎన్‌ న్యూస్‌ 18
ప్రముఖ మీడియా సంస్థ సీఎన్‌ఎన్‌ న్యూస్‌ 18 ఎగ్జిట్‌ పోల్స్‌లో బీఆర్‌ఎస్‌కు 48 సీట్లే వస్తాయని తెలిపింది. కాంగ్రెస్‌కు 56, బీజేపీకి 10 సీట్లు రానున్నాయని వెల్లడించింది. 

కాంగ్రెస్‌కు మ్యాజిక్‌ ఫిగర్‌ : ఆరా మస్తాన్‌ సర్వే 
తెలంగాణ ఎన్నికలపై ఇప్పటివరకు పక్కాగా సర్వేలు విడుదల చేసిన ఆరా మస్తాన్‌ ‍ప్రీ పోల్‌ సర్వే కూడా బీఆర్‌ఎస్‌కు 41-49 సీట్లే రానున్నాయని తెలిపింది. కాంగ్రెస్‌కు ఏకంగా 58-67 సీట్లు రానున్నాయని వెల్లడించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆరా మస్తాన్‌ సర్వే బీఆర్‌ఎస్‌దే విజయం అని చెప్పింది. ఆరా చెప్పినట్లుగానే బీఆర్‌ఎ్‌స్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 

చాణక్య స్ట్రాటజీస్‌లో బీఆర్‌ఎస్‌కు 30 సీట్లే..
చాణక్యస్ట్రాటజీస్‌ ఎగ్జిట్‌ పోల్‌లో బీఆర్‌ఎస్‌ ఘోర పరాజయం పాలవనుందని వెల్లడించింది. ఈ సర్వే బీఆర్‌ఎస్‌కు 22 నుంచి 30 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. కాంగ్రెస్‌కు సీట్లు 78 వరకు వెల్లవచ్చని పేర్కొంది. 

బీఆర్‌ఎస్‌దే హ్యాట్రిక్‌ : పల్స్‌ టుడే 
పల్స్‌ టుడే ఎగ్జిట్‌ పోల్‌ బీఆర్‌ఎస్‌కు 71 సీట్ల దాకా రావచ్చని తెలిపింది. ఈ సర్వేలో కాంగ్రెస్‌ 38 సీట్ల దగ్గరే ఆగిపోవచ్చని పేర్కొంది. ఈ సర్వేతో పాటు పొలిటికల్‌ గ్రాఫ్‌, థర్డ్‌ విజన్‌లాంటి సంస్థలు బీఆర్‌ఎస్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ ఈజీగా చేరుకుంటుందని తెలిపింది.

మెజారిటీ పోల్స్‌లో వెనుకబడ్డ కారు

సుమారు ఇరవై దాకా సర్వే సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ రిలీజ్‌ చేయగా వాటిలో 15కుపైగా సర్వేలు ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ది వెనుకంజేనని వెల్లడించాయి. కొన్ని సంస్థలు మాత్రమే మళ్లీ బీఆర్‌ఎస్‌దే అధికారం అని తెలిపాయి. చాలా వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కంటే వెనుకబడిందని చెప్పడంతో తుది ఫలితాల్లో ఇదే నిజమయ్యే ఛాన్స్‌ లేకపోలేదని రాజకీయ పండితులు అభిప్రాయడుతున్నారు. 

ఎగ్జిట్‌ పోల్స్‌ను తారుమారు చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది : కేటీఆర్‌ 

కాగా, ఎగ్జిట్‌పోల్స్‌ రిలీజ్‌ అయిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ మాత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ రబ్బిష్‌ అని కొట్టి పారేయడం విశేషం. తమ పార్టీకి ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పని రుజువు చేసే చరిత్ర ఉందన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పయితే క్షమాపణ చెప్తారా అని ఎదురు  ప్రశ్నించారు. 3వ తేదీన బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కొట్టడం పక్కా అని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. 

ఎగ్జిట్‌ పోల్స్‌ పూర్తి పట్టిక కోసం..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)