Breaking News

కరీంనగర్‌లో కేసీఆర్‌ పొలంబాట.. రైతులకు పరామర్శ

Published on Fri, 04/05/2024 - 11:06

Live Updates..

► కరీంనగర్‌లో కేసీఆర్‌ పొలంబాట
►కరీంనగర్‌ చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్‌
►జిల్లాలోని మొగ్దుంపూర్‌లో ఎండిపోయిన పంటను కేసీఆర్‌ పరిశీలించారు. ఈ సందర్బంగా రైతులను పరామర్శించారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

► రోడ్డు మార్గంలో కరీంనగర్‌కు బయలుదేరిన మాజీ సీఎం కేసీఆర్‌

►లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రైతులతో మమేకమవుతున్నారు. రాష్ట్రంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ రైతులను పరిశీలిస్తున్నారు. నేడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. 

►ఈ సందర్బంగా సాగునీటి కొరతతో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. హైదరాబాద్‌ నుండి రోడ్డుమార్గంలో ప్రత్యేక బస్సులో రానున్న కేసీఆర్‌ ముందుగా కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం, కరీంనగర్‌ రూరల్‌ మండలాల్లో ఎండిన పొలాలను పరిశీలిస్తారు.

► మధ్యాహ్నం మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఇంట్లో భోజనం చేస్తారు. ఆ తరువాత సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం, వేములవాడ నియోజకవర్గాల్లో పంటలను పరిశీలిస్తారు. సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అనంతరం ఎర్రవల్లిలోని ఆయన ఫామ్‌హౌజ్‌కు తిరుగుపయనమవుతారు. కాగా, ఈ పర్యటనలో కేసీఆర్‌ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)