Breaking News

సందేశ్‌ఖాళీ ఓ కట్టుకథ.. మాజీ బీజేపీ నేత సంచలన కామెంట్స్‌

Published on Fri, 05/24/2024 - 09:15

కోల్‌కత్తా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. బీజేపీ జనరల్‌ సెక్రటరీ, సీనియర్‌ నాయకురాలు సిరియా పర్విన్‌.. కాషాయ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం పర్విన్‌.. అధికార టీఎంసీలో చేరారు. ఈ సందర్భంగా బెంగాల్‌లో బీజేపీ నేతలపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

ఇక, బీజేపీకి రాజీనామా సందర్భంగా సిరియా పర్విన్‌ మీడియాతో మాట్లాడుతూ.. బెంగాల్‌లో సందేశ్‌ఖాళీ ఘటన అంతా బీజేపీ నేతల ప్లాన్‌ ప్రకారం జరిగింది. అదంతా ఓ కట్టుకథ(పొలిటికల్‌ డ్రామా). సందేశ్‌ఖాళీలో మహిళలతో మాట్లాడేందుకు బీజేపీ నేతలు వేరు వేరు సిమ్‌ కార్డ్స్‌, ఫోన్లు ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగానే రేఖా పాత్రకు బీజేపీ నేతలు డబ్బులు ఇచ్చి డ్రామా నడిపారు. దీనికి సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. త్వరలోనే వాటిని బహిర్గతం చేస్తాను అంటూ సంచలన కామెంట్స్‌ చేశారు.

ఇదే సమయంలో టీఎంసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తృణముల్‌ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ అనేక ఆరోపణలు చేస్తోంది. అవేవీ నిజం కాదు. టీఎంసీ నేతలు ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే నేను టీఎంసీలో చేరుతున్నానని కామెంట్స్‌ చేశారు. ఇక, సందేశ్‌ఖాళీ వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చిన వారిలో సిరియా పర్విన్‌ కూడా ఒకరు కావడం గమనార్హం.

ఇదిలా ఉండగా.. సందేశ్‌ఖాళీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సందేశ్‌ఖాళీలో భూముల కబ్జాలకు పాల్పడి మహిళలపై లైంగిక దాడులు చేశారన్న కేసులో టీఎంసీ మాజీ నేత షేక్‌ షాజాహాన్‌ అరెస్ట్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో టీఎంసీ షాజహాన్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. మరోవైపు.. సందేశ్‌ఖాళీ ఘటనపై ఉద్యమించిన కారణంగా రేఖా పాత్ర అనే మహిళకు బీజేపీ లోక్‌సభ టికెట్‌ను ఇచ్చింది. బసిర్‌హత్ లోక్‌సభ స్థానంలో టీఎంసీకి చెందిన హాజీ నూరుల్ ఇస్లాం, బీజేపీ అభ్యర్థి రేఖా పాత్ర మధ్య ద్వైపాక్షిక పోరు నెలకొంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)