Breaking News

పొంగులేటి, జూపల్లితో భేటీపై ఈటల రాజేందర్‌ ఏమన్నారంటే?

Published on Thu, 05/04/2023 - 19:11

సాక్షి, ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో బీజేపీ చేరికల కమిటీ బృందం భేటీపై ఈటల రాజేందర్‌ క్లారిటీ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా,  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకే వారిని కలిసినట్లు స్పష్టం చేశారు. కాగా  పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో బీజేపీ చేరికల కమిటీ బృందం ఖమ్మంలో గురువారం భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే.

పొంగులేటి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన ముఖ్యమైన అనుచరులతో సైతం బీజేపీ చేరికల కమిటీ బృందం చర్చలు జరిపింది. దాదాపు అయిదు గంటలుపైగా చర్చలు కొనసాగాయి. ఈ సమావేశానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. 
చదవండి: తెలంగాణ బీజేపీలో లుకలుకలు?..పొంగులేటి ఎపిసోడ్‌తో బట్టబయలు

సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నాం
అనంతరం ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ను బొద్దపెట్టే ఏకైక పార్టీ బీజేపీయేనని తెలిపారు. తమ లక్ష్యం, పొంగులేటి, జూపల్లి లక్ష్యం ఒకటేనని అన్నారు. పొంగులేటిని బీజేపీని ఆహ్వానించామని, ఆయన నిర్ణయం సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. పొంగులేటితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, కలిసికట్టుగా పనిచేసి కేసీఆర్‌ను గద్దె దించుతామని అన్నారు. 

పార్టీలో సుముచిత స్థానం
పొంగులేటి , జూపల్లికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఈటల రాజేందర్‌ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు మీకు ఎదురైన సమస్యలు, అవమానాలు తమకు తెలుసని, బీజేపీలో అవన్నీ ఉండవని తెలిపారు. మీ దృష్టిలో ఉన్న నియోజకవర్గాల్లో పోటీకి మీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించే విధంగా అమిత్ షా, నడ్డాతో మాట్లాడుతామని ఇద్దరు నేతలకు ఈటల చెప్పినట్లు తెలుస్తోంది. అయితే చేరికల కమిటీ ఎదుట పొంగులేటి, జూపల్లి పలు డిమాండ్‌లు ఉంచినట్లు సమాచారం. చర్చల్లో పార్టీలో చేరికపై పొంగులేటి, జూపల్లి బీజేపీ బృందానికి ఎటువంటి హామీ ఇవ్వలేదు. త్వరలో తమ అనుచరులతో మాట్లాడి నిర్ణయం చెబుతామనిపేర్కొన్నారు. 
చదవండి: ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కొత్త ప్రతిపాదన 

బీజేపీ నేతలతో భేటీ అనంతరం పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆలోచలను సీఎం కేసీఆర్‌ తుంగలో తొక్కారని మండిపడ్డారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకు అందరూ ఏకమయ్యేలా చూడాలన్నారు. మాయ మాటలతో మూడవసారి సీఎం కావాలనే ఆశ కలగానే మిగులుతుందని జోస్యం చెప్పారు. పదవుల పంపకమేమి లేదు..  ఏపార్టీ వాళ్లయిన తమతో సంప్రదింపులు జరిపి, పార్టీలోకైనా ఆహ్వానించవచ్చని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు వచ్చిన కమ్యూనిస్ట్‌లు  వచ్చినా స్వాగతిస్తామన్నారు.

బీజేపీలోకి రావాలని గతంలోనే ఢిల్లీ పెద్దలు అడిగారని పొంగులేటి తెలిపారు. కేసీఆర్‌ ఖమ్మంలో పోటీచేస్తే ఆయననై కూడా పోటీచేస్తానని పేర్కొన్నారు. బీజేపీలోకి రావాలని గతంలోనే ఢిల్లీ పెద్దలు అడిగారని ప్రస్తావించారు. అయితే తాను ఏ పార్టీలో చేరుతాననే దానిపై ఈనెలలో సస్పెన్స్‌కు తెరపడుతుందనుకుంటున్నట్లు చెప్పారు.  కేసీఆర్‌ను గద్దె దించడమే మా అందరి లక్ష్యం. తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే   నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.

ఏ నిర్ణయం తీసుకోలేదు..
నేటీ బీజేపీ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జూపల్లి కృష్ణారావు తెలిపారు. గతంలో చెప్పినట్టుగానే రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు, సంస్థలు, ఉద్యమకారులు, కళాకారులందరినీ సంఘటితం చేసి.. లక్ష్య సాధన కోసం ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తామన్నారు.  ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.
చదవండి: నంది అవార్డుల వివాదంపై స్పందించిన మంత్రి తలసాని

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)