Breaking News

రేవంత్‌కు మతి భ్రమించింది

Published on Sun, 05/12/2024 - 04:34

కంటోన్మెంట్‌ (హైదరాబాద్‌): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మతి భ్రమించిందని, సంచలనం కోసం ఏదిపడితే అదే మాట్లాడటం ఆయనకు అలవాటై పోయిందని బీజేపీ మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ అభ్యర్థి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ దేశానికి కేన్సర్‌లా పట్టుకుందన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

ఎన్నికల ప్రచారం చివరి రోజైన శనివారం కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వంశా తిలక్, బీజేపీ సీనియర్‌ నేత మల్క కొమురయ్యలతో కలిసి మహేంద్రాహిల్స్‌లో విలేకరులతో మాట్లాడుతూ...వాస్తవానికి కాంగ్రెస్‌ పార్టీయే దేశానికి కేన్సర్‌లా తయారైందన్నారు. గత రెండు పర్యాయాలుగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయిన కాంగ్రెస్‌కు ఈసారి కూడా అదే పరిస్థితి తప్పదని ఈటల రాజేందర్‌ జోస్యం చెప్పారు. పాలించే సత్తా మాకే ఉందంటూ రేవంత్‌రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను అవమానించారని విమర్శించారు. డీకే అరుణ గెలిస్తే, ఈటల ఆధ్వర్యంలో పనిచేయాల్సి వస్తుందనడంలో రేవంత్‌ ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. 

ప్రజల మద్దతు నాకే ఉంది 
కాంగ్రెస్‌ పార్టీ ఓటమి భయంతోనే కంటోన్మెంట్‌లో డబ్బు సంచులతో దిగిపోయిందని ఈటల ఆరోపించారు. అయినప్పటికీ మల్కాజ్‌గిరి ప్రజలు తనకే మద్దతు ఇస్తున్నారని అన్నారు. మోదీ సమర్థ పాలనతో దేశం ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. కంటోన్మెంట్‌ విలీనానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఈటల రాజేందర్‌ అన్నారు. అయితే కంటోన్మెంట్‌ విలీనానికి వ్యతిరేకంగా బీజేపీకే చెందిన కంటోన్మెంట్‌ బోర్డు సభ్యుడు రామకృష్ణ రాసిన లేఖ ఫేక్‌ లెటర్‌ అని కొట్టిపారేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)