Breaking News

నిన్నటి దాకా ఘాటు కౌంటర్లు.. ఇవాళ ఆత్మీయ ఆలింగనం!!

Published on Mon, 07/03/2023 - 15:36

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బీజేపీలో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటి వరకు ఎడమొహం, పెడమొహం పెట్టుకున్న నేతలిద్దరూ లంచ్‌ మీట్‌.. ఆపై ఆత్మీయ ఆలింగనంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ట్వీట్ల యుద్ధంతో కాకరేపిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి.. చివరకు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లంచ్ మీట్‌లో కలవడం, ఆపై ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం చర్చనీయాశంగా మారింది. 

మొయినాబాద్‌లోని జితేందర్ రెడ్డి ఫాంహౌజ్ ఏర్పాటు చేసిన లంచ్‌ మీట్‌లో మాజీ ఎంపీ జితేందర్, హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల భేటీ అయ్యారు. అనూహ్యంగా ఈ ఇద్దరూ నేతలు భేటీ అవ్వడం వెనుక ఆంతర్యమేంటనే దానిపై కార్యకర్తలు విస్తృతంగా చర్చ సాగుతోంది. కొద్ది రోజులుగా రాష్ట్ర నాయకత్వంలో మార్పులు, చేర్పులు జరుగుతాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే ఈటల రాజేందర్ కు సైతం కీలక బాధ్యతలు అప్పగిస్తారని జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పరస్సర కౌంటర్లు చేసుకున్న వీళ్లు.. ఆప్యాయంగా పలకరించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఈటలతో భేటీ అనంతరం.. ‘‘రాష్ట్ర బీజేపీపై తప్పుడు ప్రచారం సరికాదు. పార్టీలో అంతా కలిసి పని చేస్తాం. నా ట్వీట్‌ను ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం’’ అంటూ మీడియా ద్వారా జితేందర్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే.. 

ఇంతకు ముందు ‘తెలంగాణ నాయకత్వాన్ని వ్యతిరేకించేవాళ్లకు ఇలాంటి ట్రీట్‌మెంట్‌ అవసరం’ అంటూ దున్నపోతును ట్రాలీ ఎక్కించే వీడియో ఒకటి పోస్ట్‌ చేసి పెనుదుమారమే రేపాయాన. ఆపై ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేసి.. మళ్లీ పోస్ట్‌ చేసి.. చివరకు బీఆర్‌ఎస్‌ నేతలకు కౌంటర్‌ అనే మీనింగ్‌ వచ్చేలాగా దానిని పోస్ట్‌ చేశారు. అయితే ఈ వ్యవహారంపైనా ఈటల కూడా కాస్త కటువుగానే స్పందించారు. 

సీనియర్లు, అన్నీ తెలిసిన వారు ఇతరుల ఆత్మగౌరవానికి భంగం కలిగించవద్దని ఈటల కామెంట్స్ చేశారు. అంతేకాకుండా వయసు పెరిగిన కొద్ది జాగ్రత్తగా మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. కాగా ఇప్పుడు లంచ్ మీట్ లో ఈ ఇద్దరు నేతల మధ్య నవ్వులు.. ఆత్మీయ అలింగనాలతో భేటీ సాగింది.

ఇదిలా ఉంటే.. ఈటల, ఏపీ జితేందర్ రెడ్డికి మధ్య ముందు నుంచే స్నేహముంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు జితేందర్ రెడ్డి ఇంచార్జీ గా సైతం వ్యవహరించారు. అన్నీ తానే దగ్గరుండి చూసుకున్నారు. కాగా గత నెల జితేందర్ రెడ్డి ఇంట్లో అసంతృప్తి నేతలు సమావేశం నిర్వహించారు. అప్పటి నుంచి బీజేపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. మొత్తానికి ఇప్పుడు లంచ్ మీట్ తో పాత మిత్రులు మళ్లీ ఒక్కటయ్యారు.

ఇదీ చదవండి: ఏయ్‌.. నన్నే ఆపుతారా?.. కేఏపాల్‌ హల్‌చల్‌

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)