Breaking News

తెలంగాణ బీజేపీలో సైలెంట్‌ వార్‌.. వారిద్దరూ ఎందుకు రాలేదు?

Published on Thu, 06/22/2023 - 11:42

సాక్షి, హైదరాబాద్‌: ‘మహా జన్‌సంపర్క్‌ అభియాన్‌’లో భాగంగా తెలంగాణలో నేటి నుంచి ‘ఇంటింటికీ బీజేపీ’పేరిట కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు తొమ్మిదేళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాల గురించి ప్రజలకు వివరించనున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ కరీంనగర్‌లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఇదిలా ఉండగా, బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘మహా జన్‌సంపర్క్‌ అభియాన్‌’ ప్రచారానికి సీనియర్లు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో, తెలంగాణ కాషాయ పార్టీలో ఉన్న విబేధాలు మరోసారి బహిర్గమయ్యాయి. అయితే, ఈ కార్యక్రమానికి హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దూరంగా ఉన్నారు. ఇక, కొద్ది రోజులుగా ఈ ఇద్దరు నేతలు పొలిటికల్‌గా సైలెంట్‌ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఈటల, రాజగోపాల్‌రెడ్డి తీరుపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. 

అయితే, తెలంగాణ బీజేపీలో ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు అప్పగించే విషయంలో అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈటల సైలెంట్‌ అయినట్టు సమాచారం. మరోవైపు.. కాంగ్రెస్‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాక్టివ్‌ కావడంతో ఆయన సోదరుడు రాజగోపాల్‌ రెడ్డి సైలెంట్‌ అయ్యారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక, ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతుండగా.. కాంగ్రెస్‌ వీడిన వారందరూ మళ్లీ హస్తం గూటికి వస్తారు అని కామెంట్స్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో, రాజగోపాల్‌రెడ్డి కూడా మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్తారనే ప్రచారం జోరందుకుంది. 

ఇది కూడా చదవండి: గద్దర్‌ అంటే మాకు గౌరవం ఉంది: బండి సంజయ్‌

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)