Breaking News

73 మంది అభ్యర్థులపై అనర్హత వేటు!

Published on Sat, 03/23/2024 - 12:17

ఛత్తీస్‌గఢ్ రాజకీయాల్లో మరో సంచలనం నమోదయ్యింది. ఎన్నికల నిబంధనలను పట్టించుకోని 73 మంది అభ్యర్థులను భారత ఎన్నికల సంఘం (ఎలక్షన్‌ కమిషన్‌) అనర్హులుగా ప్రకటించింది. 

ఖర్చు వివరాలు తెలియజేయని లేదా ఇతర నిబంధనలను పాటించని ఈ అభ్యర్థులు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేదు. భారత ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో ఈ అభ్యర్థుల జాబితాను బహిరంగపరిచింది. అనర్హతకు గురయిన ఈ  73 మందిలో 65 మంది అభ్యర్థులు 2024 వరకు, ఎనిమిదిమంది అభ్యర్థులు 2025 వరకు ఎన్నికల్లో పోటీ చేయలేరు. 

ఛత్తీస్‌గఢ్‌లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమయ్యింది. వీటిని పరిశీలించాక సంబంధిత అధికారులు అనర్హుల జాబితాను విడుదల చేశారు. రాయ్‌పూర్ జిల్లా నుండి గరిష్టంగా 17 మంది అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించారు. ఈ  అనర్హుల జాబితాను భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిందని డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి యుఎస్ బాండే తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌లోని 11 స్థానాలకు మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న రాష్ట్రంలో తొలి దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఏప్రిల్ 19న ఒక స్థానానికి, ఏప్రిల్ 26న మూడు స్థానాలకు, మే 7న ఏడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)