Breaking News

పథకాల అమలుపై వివరణ ఇవ్వండి

Published on Tue, 10/31/2023 - 01:45

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను లబ్ధిదారులకు అందిస్తున్న తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పుడు పథకాల పంపిణీ ఎలా ఉండాలి? నిబంధనల అమలు ఎలా ఉంది? అనే కోణంలో పరిశీలన మొదలుపెట్టింది. దళితబంధు, రైతుబంధు, బీసీ బంధులాంటి పథకాలకు సంబంధించి ప్రస్తుత సమయంలో లబ్ధిదారులకు సాయం అందించే అంశంపై కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ పథకాల కింద ఎంపిక చేసిన లబ్ధిదారులకు నోటిఫికేషన్‌ వచ్చే నాటికి లబ్ధి చేకూర్చాలని, ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత పంపిణీ చేస్తే ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందని టీపీసీసీ ఎన్నికల సంఘానికి వివరించింది. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం.. సంబంధిత శాఖలను వివరణ కోరింది. తక్షణమే స్పందించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. 

నివేదికలు సిద్ధం 
సంక్షేమ పథకాల అమలుపై ఎన్నికల సంఘం నివేదిక కోరడంతో సంబంధిత శాఖలు వివరణ ఇచ్చేందుకు ఉపక్రమించాయి. పథకాల వారీగా శాఖలు ఇప్పటికే సమాచారాన్ని సిద్ధం చేసుకున్నాయి. దళితబంధు పథకం నియోజకవర్గం యూనిట్‌గా అమలు చేస్తున్న క్రమంలో హుజూరాబాద్‌ నియోజకవర్గం మినహా మిగతా 118 నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక జాబితాలు, నిర్వహించిన అవగాహన కార్యక్రమాలపై పూర్తిస్థాయి సమాచారంతో ఎస్సీ కార్పొరేషన్‌ సిద్ధమైంది.

కాగా, రెండోవిడత దళితబంధు పథకం కింద నియోజకవర్గానికి ఐదు వందల మంది లబ్ధిదారులకు సాయం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌కు అనుమతి ఇచ్చింది. దీంతో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల ద్వారా పలు సిఫార్సులు రావడంతో వాటిని పరిశీలించి అర్హులను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ పథకం కింద మొదటి విడతలో కూడా ఎంతమందికి లబ్ధి చేకూర్చారన్నది కూడా ఎన్నికల సంఘానికి వివరించనుంది.

అదేవిధంగా రైతుబంధు పథకం కింద గత ఐదేళ్లుగా పంపిణీ చేసిన మొత్తంతో పాటు ప్రస్తుతం ఉన్న లబ్ధిదారులు, వారికి ఇవ్వాల్సిన నిధులు తదితర సమాచారాన్ని సైతం వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. దీంతోపాటు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అమలు చేస్తున్న బీసీబంధు పథకం కింద అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలను సమర్పించేందుకు సిద్ధమైంది. ఈ పథకం కింద ఎంతమందికి ఆర్థిక సాయం అందించారనే అంశాలను కూడా నివేదిక రూపంలో తయారుచేసి పెట్టుకుంది. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ వివరాలను ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల సంఘానికి సమర్పించనున్నట్లు సమాచారం.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)