Breaking News

వీడిన గందరగోళం.. సాయంత్రం కేబినెట్‌ భేటీ

Published on Sat, 05/18/2024 - 08:13

హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మంత్రిమండలి సమావేశ నిర్వహణపై గందరగోళం వీడింది. ఇవాళ భేటీ ఉంటుందని రెండ్రోజుల కిందటి సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించగా.. సీఎం కార్యాలయం నుంచి మంత్రులకు ఇప్పటిదాకా అధికారిక సమాచారం వెళ్లకపోవడంతో ఉంటుందా? ఉండదా? అనే చర్చ నడిచింది. చివరకు సాయంత్రం భేటీ ఉంటుందని తెలుస్తోంది. 

కీలకమైన అంశాలపై తెలంగాణ మంత్రి మండలిలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని సీఎం రేవంత్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న కారణంగానే తెలంగాణ  కేబినేట్ సమావేశం పై తర్జనభర్జన కొనసాగింది. మరోవైపు ఇప్పటికే కేబినేట్‌ భేటీలో చర్చించే అంశాలు ఇవేనంటూ సీఎంవో కొన్ని అంశాలను మీడియాకు విడుదల చేసింది. 

  • తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలు

  • రుణమాఫీ నిధుల సమీకరణ పై నిర్ణయం

  • ధాన్యం కొనుగోళ్లు , ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చ

  • రాష్ట్ర ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై చర్చ

  • మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల కు  సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన  మధ్యంతర నివేదిక ఆధారంగా  చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చ

  • కొత్త విద్యా సంవత్సరం లో చేపట్టవలసిన చర్యలపై చర్చ


కేబినెట్‌ భేటీ నిర్వహణ కోసం ఎన్నికల సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం అనుమతి కోరినట్లు సమాచారం. అయితే అనుమతి దొరికిందా? లేదా? అనే స్పష్టత రాలేదు. ఈలోపే సాయంత్రం 4గం. కేబినెట్‌ భేటీ ఉంటుందని మీడియాకు సీఎంవో సమాచారం అందించింది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)