Breaking News

‘ఏక్‌నాథ్‌ షిండే కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపారు’

Published on Sat, 03/15/2025 - 19:38

ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ఒకానొక సమయంలో కాంగ్రెస్ లో జాయిన్‌ అయ్యేందకు మొగ్గు చూపారన్నారు శివసేన(యూబీటీ) నేత, ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడు సంజయ్ రౌత్.  ఆ విషయం తనతో పాటు కాంగ్రెస్‌లో కొంతమంది నేతలకు సైతం తెలుసంటూ ఎంపీ సంజయ్ రౌత్ నొక్కి మరీ చెప్పారు.

ఈ క్రమంలోనే దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తో ఏక్‌నాథ్‌ షిండే బేరసారాలు జరపారన్నారు. ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పడానికి అహ్మద్ పటేల్ మన మధ్య లేరని,  ఇంకో సీనియర్ నేత, మాజీ సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ కు ఈ విషయం తెలుసన్నారు. దీనిపై ఇంతకు మించి తాను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదని స్పష్టం చేశారు సంజయ్ రౌత్.

అయితే  సంజయ్ రౌత్ కామెంట్లపై పృథ్వీరాజ్ చౌహాన్ ను మీడియా సంప్రదించగా, ఆయన మాట్లాడటానికి నిరాకరించారు. మరొకవైపు ఏక్‌నాథ్‌ షిండే కూడా అందుబాటులో లేరు. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే ఏక్ నాథ్ షిండ్, పృథ్వీరాజ్ చౌహాన్ లు స్పందిస్తే గానీ క్లారిటీ రాదు.

2౦22లో శివసేన(యూబీటీ) నుంచి ఏక్‌నాథ్‌ షిండే దూరం కావడంతో పాటు ప్రత్యేక వర్గంతో మహాయుతి కూటమిలో జాయిన్ అయ్యారు. దాంతో శివసేన రెండు ముక్కలైంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు ఏక్‌నాథ్‌ షిండే సీఎం అయ్యారు. ఆపై 2024లో మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంతో పాటు అందులో బీజేపీకి అత్యధిక సీట్లు రావడంతో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అయ్యారు. ప్రస్తుతం ఏక్‌నాథ్‌ షిండే మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నారు.

కొన్ని రోజుల క్రితం ఫడ్నవీస్, ఏక్‌నాథ్‌ షిండేల మధ్య విభేదాలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది. దీనికి బలం చేకూరుస్తూ ఏక్‌నాథ్‌ షిండే మీడియా ముఖంగా కొన్ని ఘాటు వ్యాఖ్యలు సైతం చేశారు. తన బలమేమిటో కొంతమంది తెలుసుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. తన చరిత్ర ఏమిటో గతాన్ని అడిగితే చెబుతుందంటూ కూటా శివసేనను ముక్కలు చేసిన చరిత్రను చెప్పుకొచ్చారు. ఇదే వార్నింగ్ మహారాష్ట్ర బీజేపీకి కూడా పరోక్షంగా ఇస్తున్నారా? అని ఏక్‌నాథ్‌ షిండే వ్యాఖ్యల ద్వారా అనుమానం కల్గింది. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)