Breaking News

మెరుగుపడని ఆరోగ్యం.. ఆస్పత్రికి ఏక్‌నాథ్‌ షిండే

Published on Tue, 12/03/2024 - 14:30

ముంబై: మహరాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ వైపు మహాయుతి కూటమిలో ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్‌ కొనసాగుతుండగా.. ప్రస్తుత, మహరాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ఆస్పత్రి పాలయ్యారు.

గతవారం అనారోగ్యం కారణంగా ఏక్‌నాథ్‌ షిండే సతారాలోని తన స్వగ్రామానికి వెళ్లారు. అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడ కూడా ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో షిండేని అత్యవసర చికిత్స నిమిత్తం థానేలోని జూపిటర్‌ ఆస్పత్రికి తరలించారు.

పలు రకాల వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఏక్‌నాథ్‌ షిండే ఆరోగ్యం మెరుగుపడలేదని నిర్ధారించారు. పూర్తి స్థాయిలో  వైద్య పరీక్షలు చేయాలని సూచించారు.దీంతో ఆస్పత్రిలో అడ్మిట్‌ కావాల్సి వచ్చింది.

కొద్ది సేపట్లో మహాయుతి కూటమి కీలక సమావేశం
ఓ వైపు ఏక్‌నాథ్‌ షిండే అనారోగ్య రిత్యా ఆస్పత్రిలో చేరాగా.. మరోవైపు మహాయుతి కూటమి కీలక సమావేశం మరికొద్ది సేపట్లో జరగనుంది. ఈ సమావేశంలో మహారాష్ట్ర కేబినెట్ పోర్ట్‌ఫోలియో కేటాయింపుపై చర్చ జరగనున్నట్లు సమాచారం.

వేర్వేరు నగరాల్లో మహాయుతి కీలక నేతలు
మహారాష్ట్ర సీఎం ఎంపికపై ఉత్కంఠత కొనసాగుతుంది. మహాయుతి కూటమిలో ముఖ్యమంత్రి ఎంపికపై కసరత్తు జరుగుతున్న తరుణంలో కీలక నేతలు వేర్వేరు నగరాల్లో ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ముంబైలో ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని కీలక నేతలు మహరాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి కన్ఫ్యూజన్‌ లేదని స్పష్టత ఇచ్చారు.   

గత వారం ఏక్‌నాథ్‌ షిండే అనారోగ్యంతో తన స్వగ్రామానికి వెళ్లారు. నాటి నుంచి మహాయుతి కూటమి నిర్వహించే సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. గత శనివారం ఏక్‌నాథ్‌ షిండేని పరీక్షించిన వైద్యులు వైరల్ ఇన్ఫెక్షన్, జ్వరంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. తాజాగా, మంగళవారం మధ్యాహ్నం ఆరోగ్యం కుదుట పడకపోవడంతో థానేలోని జూపిటర్‌ ఆస్పత్రికి వెళ్లారు.  

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)