Breaking News

మళ్లీ అలిగిన షిండే..కారణం అదే..!

Published on Tue, 02/04/2025 - 15:09

ముంబయి:అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెలలు గడిచిన తర్వాత కూడా మహారాష్ట్ర రాజకీయాలు ఇంకా రసవత్తరంగానే కొనసాగుతున్నాయి. తాజాగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ నిర్వహించిన సమావేశానికి డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌షిండే గైర్హాజరయ్యారు. గత వారం కూడా క్యాబినెట్‌ భేటీకి షిండే హాజరు కాలేదు. 

సీఎం పదవి దక్కకపోవడం,ఇంఛార్జ్‌​ మంత్రుల నియామకాలపై అసంతృప్తితో ఉండడం వల్లే షిండే వరుసగా సీఎం సమావేశాలకు రావడంలేదన్న ప్రచారం జరుగుతోంది. సీఎం ఫడ్నవీస్‌తో విభేదాల వల్లే షిండే సమావేశాలకు రావడం లేదన్న పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.

అయితే షిండే సీఎం ఫడ్నవీస్‌తో సమావేశాలకు గైర్హాజరవడంపై శివసేన ఎంపీ నరేష్‌ మస్కే క్లారిటీ ఇచ్చారు. షిండే కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్యం సరిగా లేదు. ఇందుకే సీఎంతో సమావేశాలకు రాలేదు.ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి చెందిన వారే దీనిపై లేనిపోనివి కల్పించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు’అని మస్కే తెలిపారు.

గతేడాది జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ,శివసేన,ఎన్సీపీ(అజిత్‌పవార్‌) పార్టీల మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తర్వాత శివసేన అధినేత అప్పటి సీఎం షిండే కూడా మళ్లీ తనకు ముఖ్యమంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నించారు. అయితే సీఎం పదవి బీజేపీకి వెళ్లడంతో డిప్యూటీ సీఎం పదవితో సర్దుకున్నారు. 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు