Breaking News

భూదాన్‌ స్కామ్‌.. ఈడీ విచారణకు బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే

Published on Mon, 12/16/2024 - 10:31

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో భూదాన్‌ భూముల కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నేడు నాగర్‌ కర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌ రెడ్డిని ఈడీ అధికారులు విచారించనున్నారు. జనార్థన్‌ రెడ్డితో పాటుగా మరో ముగ్గురిని కూడా ఈడీ అధికారులు విచారించనున్నారు.

రాష్ట్రంలో భూదాన్ భూముల కుంభకోణంపై ఈడీ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నేడు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌ రెడ్డిని ఈడీ అధికారులు విచారించనున్నారు. ఆయనతో పాటుగా మరో ముగ్గురిని ఈడీ అధికారులు విచారించనున్నారు. వంశీరాం బిల్డర్స్‌ సుబ్బారెడ్డి, మరో ఇద్దరికి ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విచారణను హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇక, ఈ కేసులో ఇప్పటికే ఐఏఎస్‌ అధికారి అమోయ్‌ కుమార్‌ను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఆర్డీవో, ఎమ్మార్వోను విచారించి ఈడీ కీలక వివరాలను సేకరించింది.

ఇదిలా ఉండగా.. మేడ్చల్ జిల్లాల్లో అమోయ్ కుమార్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో జరిగిన భూ లావాదేవీలపై బాధితులు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో, ఈడీ అధికారులు ఇప్పటికే అమోయ్ కుమార్‌ను పలుమార్లు ప్రశ్నించారు. రూ.కోట్ల విలువైన 42 ఎకరాల భూమిని మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఇతరులకు కేటాయించడంపై ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు అమోయ్ కుమార్, మహేశ్వరం తహశీల్దార్ వాంగ్మూలాలను నమోదు చేశారు. వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అప్పటి ఆర్డీఓ వెంకటాచారి, తహసీల్దార్ జ్యోతితోపాటు మరో నలుగురికి నోటీసులు జారీ చేశారు. వారు ఇచ్చిన కీలక పత్రాల ఆధారంగా భూ ఆక్రమణలపై పూర్తి ఆధారాలను ఈడీ సేకరించి డీజీపీకి నివేదిక సమర్పించింది. 

భూదాన్ భూముల కుంభకోణంలో కీలక పరిణామం

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు