Breaking News

ఎన్నికల బరిలో ఆటో డ్రైవర్‌

Published on Tue, 04/02/2024 - 07:39

దేశంలో త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలు పలు చోట్ల ఆసక్తికరంగా మారాయి. యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను వెల్లడించాయి. ఇంతలోనే ఈ స్థానం నుంచి ఒక ఆటో డ్రైవర్‌ ఎన్నికల రంగంలోకి దూకి, తాను బీజేపీ అభ్యర్థి డాక్టర్ మహేశ్ శర్మ, ఎస్పీ అభ్యర్థి మహేంద్ర నగర్‌లకు పోటీ ఇస్తానని చెబుతున్నాడు.

మధ్యప్రదేశ్‌కు చెందిన జ్ఞానదీప్ అనే ఆటో డ్రైవర్‌ గౌతమ్ బుద్ధ నగర్ లోక్‌సభ ఎన్నికల్లో తన పోటీకి సంబంధించి నామినేషన్‌​ పత్రాలను జిల్లా మేజిస్ట్రేట్‌ కార్యాలయంలో దాఖలు చేశాడు. ఈయన ఆటో నడుపుతూ చాలాకాలంగా గ్రేటర్‌ నోయిడాలో తన కుటుంబంతో పాటు ఉంటున్నాడు. జ్ఞాన్‌దీప్‌ మీడియాతో మాట్లాడుతూ గౌతమ్‌బుద్ధనగర్‌లో ఇప్పటి వరకు ఏ నేత కూడా  అభివృద్ధి పనులు చేపట్టలేదని, అందుకే  తాను రంగంలోకి దిగుతున్నానని తెలిపాడు. తాను మార్పును కోరుకుంటున్నానని, అందుకోసం పాటుపడతానని పేర్కొన్నాడు. స్థానికంగా రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయాడు. తాను రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డాక్టర్ మహేశ్ శర్మ, ఎస్పీ అభ్యర్థి మహేంద్ర నగర్‌లకు పోటీగా నిలుస్తానని తెలిపాడు. 

తాను ఎంపీగా ఎన్నికైతే స్థానికంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, ట్రాన్స్‌జెండర్లకు ఇళ్లు మంజూరు చేయడంతోపాటు వారికి ఉపాధి కల్పించేందుకు చేయూతనిస్తానని అన్నాడు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండేలా, వారు మూడు షిఫ్టుల్లో పనిచేసేలా చూస్తానని  పేర్కొన్నాడు..
 

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)