ప్రమాదం బారిన చండీగఢ్‌ బీఎస్ఫీ అభ్యర్థి

Published on Tue, 05/28/2024 - 11:49

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఎన్నికలకు సంబంధించిన విషయాలు ప్రధానాంశాలుగా నిలుస్తున్నాయి. తాజాగా చండీగఢ్‌ బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ రీతూ సింగ్ ప్రమాదానికి గురయ్యారు. ఆమె తలకు బలమైన గాయమైంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, తలకు కుట్లు వేశారు.

వివరాల్లోకి వెళితే స్థానికంగా ఉన్న ఒక కాలనీలోని బీఎస్‌పీ నేతలు, కార్యకర్తలు డాక్టర్ రీతూ సింగ్‌ను నాణేలతో తూకం వేస్తున్నారు. ఇంతలో ఆ తూకం తెగిపోయి, దాని రాడ్డు ఆమె తలకు తగిలింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమయ్యింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు చికిత్స అందించి, తలకు కుట్లు వేసి ఇంటికి పంపించారు.

చండీగఢ్ నుంచి డాక్టర్ రీతూ సింగ్‌ను బీఎస్పీ పోటీకి నిలిపింది. రీతూ.. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. సైకాలజీ సబ్జెక్టులో ఆమెకు విశేష అనుభవం ఉంది. యూనివర్శిటీలో చదువుకుంటున్న సమయంలో ఆమె దళితుల పక్షాన గొంతెత్తారు. ఈ నేపధ్యంలో ఆమెను డిస్మిస్ చేయడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకున్నాయి.  డాక్టర్ రీతూ సింగ్‌ పీహెచ్‌డీ పకోడా వాలీ పేరుతో ఓ స్టాల్‌ కూడా పెట్టారు. కుల వేధింపుల ఆరోపణలతో 2023, సెప్టెంబర్‌లో ఆమె ఢిల్లీ యూనివర్సిటీలో నిరసన చేపట్టారు. ఈ సమయంలోనే ఆమె విశ్వవిద్యాలయం నుండి బహిష్కరణకు గుర్యయ్యారు. 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)