Breaking News

మంత్రి సత్యవతి Vs రెడ్యానాయక్‌.. డోర్నకల్‌ బీఆర్‌ఎస్‌లో తన్నులాట!

Published on Thu, 07/13/2023 - 08:34

సాక్షి, మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ నియోజ కవర్గంలో రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ వర్గీయులు దుర్భాలాడుకుంటూ తన్నులాడుకున్నారు. పరస్పరం బాహాబాహీకి దిగారు. రూ. 5 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసేందుకు రెడ్యానాయక్‌ బుధవారం ఉదయం కురవి మండలం బంగ్యా తండాకు చేరుకున్నారు.

మా ఊరికి ఏం అభివృద్ధి చేశావంటూ తండాకు చెందిన మంత్రి సత్యవతి వర్గీయుడైన మాజీ సర్పంచ్‌ హచ్చా నాయక్‌ అనుచరులు ఎమ్మెల్యే ప్రచార రథానికి అడ్డుతగిలారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాహనం ముందు భాగంలో టైర్ల కింద పడుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎమ్మెల్యే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయకుండానే తండాలో ఏర్పాటు చేసిన సభ వద్దకు వెళ్లారు.

సభ వద్ద హచ్చానాయక్‌ తమ్ముడు కిషన్‌నాయక్‌ రభస చేస్తుండగా ఎమ్మెల్యే అనుచరుడు సింగ్యానాయక్, ఇతర వర్గీయులు అతనిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రతిగా మంత్రి సత్యవతి వర్గీయులు పెద్ద సంఖ్యలో రావడంతో ఇరువర్గాలూ ఒకరినొకరు కొట్టుకున్నారు. అంగీలు చిరిగిపోయినా ఎవ్వరూ తగ్గలేదు. చివరికి  పోలీసులు వారించినా వినలేదు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ తండానుంచి బయటకు వెళ్తుండగా కారుకు అడ్డంగా పడుకున్నారు. పోలీసులు ఆందోళనకారులను పక్కకు తప్పించడంతో ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు. పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు.
చదవండి: జడ్జి భర్తపై బీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడి.. ‘ఆస్పత్రికి వెళ్లాలి, దారి ఇవ్వండి’ అని అడిగినందుకు..

Videos

తొక్కేదాం అని చూసారు.. కానీ కలెక్షన్స్ తో తుక్కు రేగోడుతున్నాడు

FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు

జగన్, చంద్రబాబుల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా..

ముదునూరి మురళీ కృష్ణంరాజుకు వైఎస్ జగన్ పరామర్శ

గణేష్ నిమజ్జనంలో సజ్జనార్ డ్యాన్స్ వైరల్

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

Photos

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)