Breaking News

తెలంగాణలో మహిళలకు రక్షణ లేదు 

Published on Sat, 10/14/2023 - 03:04

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మహిళలపై జరుగుతున్న అత్యాచారాల్లో తెలంగాణనే నంబర్‌వన్‌గా నిలుస్తోందని గణాంకాలు చెబుతున్నాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి డోలిశర్మ అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లిక్కర్‌ విక్రయాలు పెంచడం మినహా మరేమీ చేయలేదని విమర్శించారు. కనీసం మహిళల సంక్షేమం కోసం ఒక బోర్డును కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు.

శుక్రవారం ఆమె గాందీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ మోడల్‌ విఫలమయిందని చెప్పిన డోలి శర్మ, కర్ణాటకలో మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం కృషిచేస్తోందని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో కూడా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ ఇచి్చన హామీలను నిలబెట్టుకుంటున్నామన్నారు. తెలంగాణలో పార్టీ మహిళలకు మహాలక్ష్మి పేరుతో ప్రతి మహిళకు నెలకు రూ.2,500 నగదు, రూ.500కే వంట గ్యాస్‌ సిలిండర్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లాంటి హామీలనిచ్చిందని, ఈ పథకాల పట్ల మహిళల నుంచి మంచి స్పందన కనిపిస్తోందని, ఈ పథకాలతో కాంగ్రెస్‌ పార్టీకి మహిళలు పట్టం కట్టడం ఖాయమని చెప్పారు.

టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్‌ జెట్టి కుసుమకుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, అధికారంలోకి వచి్చన మొదటి రోజు నుంచే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆబద్ధాలు ఆడుతూ కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)