Breaking News

ఎన్నికల బరిలో డజను మంది డాక్టర్‌ బాబులు! 

Published on Wed, 10/25/2023 - 03:14

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: తెలంగాణ ఎన్నికల బరిలో ఉమ్మడి కరీంనగర్‌ నుంచి అసెంబ్లీకి పోటీ పడుతున్న అభ్యర్థుల నేపథ్యం ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ బరిలో దిగబోయేవారిలో డజనుమంది డాక్టర్లు ఉండటం విశేషం. వీరిలో ఎనిమిది మంది ఎంఎస్, ఎంబీబీఎస్, బీడీఎస్‌ వంటి వైద్యశాస్త్రం చదివిన విద్యావంతులు ఉన్నారు. అదే సమయంలో కొందరు పీహెచ్‌డీ చేసి డాక్టరేట్‌ పొందిన అభ్యర్థులూ ఉన్నారు. ఈసారి అసెంబ్లీ బరిలో నిలిచేవారిలో ఉమ్మడి కరీంనగర్‌లోని పలు అసెంబ్లీ స్థానాల నుంచి 12 మంది పేర్లలో తొలుత డాక్టర్‌ ఉండటం గమనార్హం. అదే సమయంలో ఇద్దరు రంజీ ప్లేయర్లు కూడా అసెంబ్లీ బరిలో నిలవడం విశేషం. 

ఎనిమిది మంది వైద్యులు 
డాక్టర్‌ సంజయ్‌ ఎంఎస్, ఎమ్మెల్యే (బీఆర్‌ఎస్‌–జగిత్యాల) 
డాక్టర్‌ సంజయ్‌ ఎంఎస్, (బీఆర్‌ఎస్‌– కోరుట్ల)  
డాక్టర్‌ భోగశ్రావణి బీడీఎస్‌ (బీజేపీ–జగిత్యాల) 
డాక్టర్‌ వికాస్‌బాబు ఎంబీబీఎస్‌ (బీజేపీ– వేములవాడ) 
డాక్టర్‌ కే.సత్యనారాయణ ఎంఎస్‌ (కాంగ్రెస్‌–మానకొండూరు) 
డాక్టర్‌ బల్మూరి వెంకట్‌ ఎంబీబీఎస్‌ (కాంగ్రెస్‌–హుజూరాబాద్‌)  
డాక్టర్‌ జేఎన్‌ వెంకట్‌ ఎంబీబీఎస్‌ (బీజేపీ – కోరుట్ల) 
డాక్టర్‌ నగేశ్‌ ఎంబీబీఎస్‌ (వైఎస్సార్‌ టీపీ– కరీంనగర్‌) 

నలుగురు డాక్టరేట్‌లు 
డాక్టర్‌ రసమయిబాలకిషన్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే (మానకొండూరు)  
డాక్టర్‌ కొనగాల మహేశ్‌ (కాంగ్రెస్‌–కరీంనగర్‌) 
డాక్టర్‌ మేడిపల్లి సత్యం (కాంగ్రెస్‌–చొప్పదండి) 
డాక్టర్‌ గోలి మోహన్‌ (సైంటిస్ట్‌) (బీఎస్పీ–వేములవాడ) 

ఇద్దరు క్రికెటర్లు.. 
సెకండ్‌ ఇన్నింగ్స్‌ విజయంపై.. 
కోరుట్ల నుంచి అసెంబ్లీ బరిలో నిలిచిన నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ రంజీ క్రికెటర్‌. 1995లో హైదరాబాద్‌ జట్టుకు ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌గా ఆడారు. గత ఎన్నికల్లో తాను ఓపెనింగ్‌ చేసిన తొలి ఎన్నికల్లో అప్పటి నిజామాబాద్‌ ఎంపీ కవితను ఓడించి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో ఇన్నింగ్స్‌లోనూ సంచలన విజయంపై అర్వింద్‌ కన్నేశారు. 

బెస్ట్‌ ఫెర్ఫామెన్స్‌ కోసం..  
ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి...2018లో ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్‌ నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా అదే ప్రత్యర్థిపై బరిలో నిలిచారు. రాజకీయాల్లోకి రాకముందు పాడి కౌశిక్‌రెడ్డి సైతం రంజీ ఆటగాడు. 2004 నుంచి 2007 వరకు హైదరాబాద్‌ జట్టులో ఫాస్ట్‌»ౌలర్‌గా కొనసాగారు. వీణవంక ఎక్స్‌ప్రెస్‌గా పేరున్న కౌశిక్‌రెడ్డి తన కెరీర్‌లో 47 వికెట్లు తీసి, ఒక అర్థసెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టిన రికార్డు కూడా కౌశిక్‌ పేరిట ఉండటం విశేషం.  

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)