Breaking News

TN: డీఎంకే ప్రచారం షురూ.. మారిన ప్రత్యర్థి !

Published on Mon, 02/19/2024 - 08:29

చెన్నై: తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల ప్రచారం మొదలైంది. అధికార పార్టీ డీఎంకే ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ‘హక్కుల కోసం స్టాలిన్‌ పోరు’ పేరుతో ప్రచార భేరి మోగించింది. చెన్నైలోని మూడు, పుదుచ్చేరిలోని ఒక్క పార్లమెంట్‌ నియోజకవర్గం తప్ప రాష్ట్రంలోని 37 లోక్‌సభ స్థానాల్లో ఒకేసారి ప్రచారం ప్రారంభించింది.

సాధారణంగా తమిళనాడులో ఎన్నిక ఏదైనా డీఎంకే, అన్నా డీఎంకే మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది. అయితే ఈసారి అనూహ్యాంగా డీఎంకే నేతలు కేంద్రంలో  అధికారంలో ఉన్న బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి ప్రారంభించారు. తమిళనాడుకు అన్యాయం చేస్తున్న బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాల్సిందేనని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి నిధులు రావాలన్నా,మైనారిటీల హక్కులు కాపాడాలన్నా ఇండియా కూటమి అధికారంలోకి రావాల్సిందేనన్నారు.

విరుదునగర్‌ జిల్లాలో జరిగిన ప్రచారంలో​ ఎంపీ కనిమొలి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమిళనాడుకు నిధులివ్వకపోయినప్పటికీ స్టాలిన్‌ విద్య,వైద్యం రంగాల్లో రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా నిలిపారని చెప్పారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకూడదని, వారు ఒక వర్గం ప్రజలను విలన్లుగా చిత్రీకరిస్తున్నారని మంత్రి శేఖర్‌బాబు ఆరోపించారు. మరోవైపు తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలై డీఎంకే ఫైల్స్‌ 3 పేరుతో టూ జీ కుంభకోణానికి సంబంధించి డీఎంకే నేతల ఆడియో విడుదల చేశారు.

ఇదీ చదవండి.. భారత్‌ జోడో న్యాయ యాత్రకు అఖిలేశ్‌ దూరం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)