Breaking News

అదే జరిగితే.. డీకేఎస్‌ సీఎం కావడం ఖాయం!

Published on Thu, 05/18/2023 - 21:28

ఢిల్లీ: కర్ణాటక సీఎం ఎంపిక కోసం కాంగ్రెస్‌ పవర్‌ షేరింగ్‌ ఫార్ములా.. అంటే చెరో రెండున్నరేళ్లు(50:50 నిష్పత్తిలో) లేదంటే ఒకరు మూడు, మరొకరు రెండు ఏళ్లు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం. ఆ గ్యాప్‌లో మరొకరికి డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పోర్ట్‌పోలియోలు అప్పజెప్పడం.. కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే రూపొందించిన పవర్‌ షేరింగ్‌ ఫార్ములా ఇదేనంటున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు. 

కాంగ్రెస్‌ సీఎం అయ్యే అవకాశం ఇంకా డీకే శివకుమార్‌కు దూరం కాలేదా?. ఆ ఛాన్స్‌ ఇంకా ఉందా? అంటే.. అవుననే అంటున్నాయి కాంగ్రెస్‌ శ్రేణులు. పైకి పవర్‌ షేరింగ్‌ ఫార్ములాకు డీకేఎస్‌ అంగీకరించలేదని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఆయన్ని షరతుల మీద అందుకు ఒప్పించే డిప్యూటీ సీఎం పదవి(పీసీసీ చీఫ్‌, 6 పోర్ట్‌పోలియోలుకూడా) కాంగ్రెస్‌ హైకమాండ్‌ కట్టబెడుతున్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ హైకమాండ్‌.. డీకే శివకుమార్‌కు ఇచ్చిన టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఇక వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 25 దక్కించుకోగా.. కాంగ్రెస్‌ ఒక్క స్థానానికే పరిమితం అయ్యింది. దీంతో.. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం కోసం కృషి చేసి మెరుగైన ఫలితం ఇస్తే డీకే శివకుమార్‌ను కర్ణాటక సీఎం కుర్చీలో.. అదీ మిగతా రెండున్నరేళ్లు/ మూడేళ్ల కాలానికి కూర్చోబెడతామని  కాంగ్రెస్‌ హైకమాండ్‌ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. దీనికి శివకుమార్‌ సైతం అంగీకరించినట్లు సమాచారం. 

అయితే ఈ ఫార్ములాపై ఆయన ఏమన్నారంటే.. ‘‘పవర్‌ షేరింగ్‌ ఫార్ములాను నేను వెల్లడించలేను. మేమంతా కలిసి జరిపిన చర్చలను నేను బహిర్గతం చేయదలచుకోలేదు. ఏదో ఒక సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు దీనికి సమాధానం ఇస్తారు. ప్రస్తుతానికి నేను బాధపడటం లేదు. ప్రయాణం ఇంకా మిగిలి ఉంది అని వ్యాఖ్యానించారు. 

‘‘పార్టీ ప్రయోజనాల దృష్ట్యా రాజీపడ్డాను. కర్ణాటక ప్రజలకు మా నిబద్ధత నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలో పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి పార్టీ హైకమాండ్‌ నిర్ణయానికి తలవంచాల్సిందే. పార్టీ ప్రయోజనాల కోసమే ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తున్నా అని డీకేఎస్‌ చెబుతున్నారు. 

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)