Breaking News

రాజగోపాల్‌ బాటలో డీకే అరుణ కూడా? 

Published on Thu, 10/26/2023 - 01:41

సాక్షి, హైదరాబాద్‌:  బీజేపీ కొత్త నేతల్లో కొందరు రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో పునరాలోచనలో పడ్డారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణ కూడా ఆ బాటలో ఉన్నట్టు కనిపిస్తోందని నేతలు అంటున్నారు. బీజేపీ తరఫున గద్వాల నుంచి పోటీ చేస్తానన్న ఆమె ఇటీవల మాట మార్చారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

అక్కడ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయన్న అంతర్గత సమాచారంతో పోటీపై వెనక్కి తగ్గారని.. గద్వాల నుంచి బీసీ అభ్యర్థి ని నిలబెడితే పూర్తి మద్దతు ఇచ్చి గెలిపిస్తానంటున్నారని పేర్కొంటున్నాయి. అసెంబ్లీకి పోటీ చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం పట్టుబడితే.. తన తల్లిగారి ప్రాంతమైన నారాయణపేట నుంచి పోటీ చేస్తానని సంకేతాలు ఇచ్చారని.. దీనిని ఆ నియోజకవర్గ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిసింది.

ఈ క్రమంలోనే డీకే అరుణ పార్టీ మారే ఆలోచన చేస్తున్నారంటూ.. రాజగోపాల్‌రెడ్డి మాదిరిగా చివరి నిమిషంలో బీజేపీని వీడి, కాంగ్రెస్‌లో చేరే అవకాశాలను తోసిపుచ్చలేమంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమె కాంగ్రెస్‌లో మక్తల్‌ లేదా నారాయణపేట సీటు అడుగుతున్నట్టు కాంగ్రెస్‌ వర్గాల సమాచారం. ఇదే జరిగితే మహబూబ్‌నగర్‌ జిల్లాలో జితేందర్‌రెడ్డి మినహా గట్టి నాయకుడు ఎవరూ లేకుండాపోతారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)