Breaking News

కొవ్వూరు టీడీపీలో ఇరు వర్గాల కొరకొర

Published on Fri, 02/02/2024 - 05:25

సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌పై అసమ్మతి రగులుతోంది. టీడీపీలోని ద్విసభ్య కమిటీ ఒక వర్గం గానూ, నియోజకవర్గాన్ని ప్రభావితం చేయగల మరో ముఖ్యనేత అచ్చిబాబు వర్గం మరోపక్క జవహర్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. నియోజకవర్గంలో వారి సానుభూతిపరులను ఏకం చేస్తున్నాయి.

రహస్య సమావేశాలు పెట్టి చర్చలు జరుపుతున్నాయి. జవహర్‌కు అసెంబ్లీ స్థానం కేటాయిస్తే మూకుమ్మడిగా వ్యతిరేకిస్తామని, తమ అభిప్రాయాన్ని కాదని అవకాశం కల్పిస్తే సార్వత్రిక ఎన్నికల్లో అడ్రస్‌ లేకుండా చిత్తుగా ఓడిస్తామని స్పష్టం చేస్తున్నాయి. ఈమేరకు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కొవ్వూరులో ఈ రెండు వర్గాల నాయకులు గురువారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ‘జవహర్‌ వద్దు – టీడీపీ ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. అధిష్టానం కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఈ పరిణామం కొవ్వూరు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.  

ముప్పిడిని బరిలోకి దింపే యోచన
కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును బరిలోకి దింపేందుకు ఈ రెండు వర్గాలూ పావులు కదుపుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు సైతం ముప్పిడి పోటీని అంగీకరించారన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ద్విసభ్య కమిటీ, అచ్చిబాబు భరోసాతో ముప్పిడి రంగంలోకి దిగి నియోజకవర్గంలో పర్యటనలు ముమ్మరం చేశారు.

నేతలను కలిసి మద్దతు  కోరుతున్నారు. గతంలో జవహర్‌తో ద్విసభ్య కమిటీలోని ఓ సభ్యుడైన జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి సన్నిహితంగా మెలిగారు. ఆ సాన్నిహిత్యంతో ఆయన ఆర్థికంగా ఎదిగినట్లు చెబుతారు. అనంతరం వారి మధ్య తలెత్తిన ఆర్థిక వివాదాలతో చౌదరి సైతం జవహర్‌కు దూరమయ్యారు. జవహర్‌ మంత్రిగా ఉన్న సమయంలో అచ్చిబాబు వర్గాన్ని వ్యతిరేకించడంతో ఆయన కూడా వ్యతిరేక కూటమి కట్టారు. 

ఫ్లెక్సీల వివాదం 
తమ పంతం నెగ్గించుకోడానికి ద్విసభ్య కమిటీ, అచ్చిబాబు వర్గాలు దొరికిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఇటీవల జవహర్‌ పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిలో వ్యక్తుల పేర్లకు బదులు గ్రామ టీడీపీ నేతలు అని పేర్కొన్నారు. ఈ ఫ్లెక్సీల ఏర్పాటు దొమ్మేరు గ్రామంలో వివాదంగా మారింది. ఓ వర్గం నేతలు గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి మరీ జవహర్‌పై విమర్శలు గుప్పించారు.

జవహర్‌ వద్దు.. టీడీపీ ముద్దు
జవహర్‌కు వ్యతిరేకంగా తాజాగా మరో నినాదాన్ని తెర పైకి తీసుకువచ్చారు. ‘జవహర్‌ వద్దు.. టీడీపీ ముద్దు’ అని ప్రచారం చేస్తున్నారు. గురువారం ఓచోట ఆత్మీయ సమావేశం పెట్టి మరీ విమర్శలు చేశారు. జవహర్‌ను కొవ్వూరు అభ్యర్థిగా పరిగణనలోకి తీసుకోవద్దని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. 2014 నుంచి సీనియర్‌ నాయకులను, కార్యకర్తలను పక్కన పెట్టిన ఆయన వర్గ విభేదాలకు కారకుడయ్యారని ఆరోపించారు. నియోజకవర్గ నాయకులు పలుమార్లు హెచ్చరించినా ఆయన తీరు మార్చుకోవడం లేదని అంటున్నారు.

జవహర్‌ వైపే అధినేత మొగ్గు
నియోజకవర్గంలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు వాటికి చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదు. సీటు ఎవరికన్న స్పష్టత ఇవ్వకపోవడంతో ఇరు వర్గాల మధ్య రోజు రోజుకూ విభేదాలు తీవ్రమవుతున్నాయి.

జవహర్‌ వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని ఆయన వర్గం ప్రచారం చేసుకుంటోంది.  ఇదే జరిగితే జవహర్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్న రెండు వర్గాలూ టీడీపీకి దూరమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ జవహర్‌ను కాదంటే ఆయన వర్గం వ్యతిరేకమయ్యే పరిస్థితి ఎదురవుతుంది. ఈ వర్గ విభేదాలతో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)