నా భార్య రూ.54 లక్షల అప్పుంది: మాజీ సీఎం

Published on Fri, 04/26/2024 - 14:45

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ మాజీ సీఎం, దివంగత ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కన్నౌజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు.

తన అభ్యర్థిత్వంతో పాటుగా ఆస్తులు, అప్పులకు సంబంధించిన అఫిడవిట్‌ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. తన వద్ద రూ. 26.34 కోట్ల ఆస్తులు ఉన్నాయని, తన జీవిత భాగస్వామి డింపుల్ యాదవ్ ఆస్తుల విలువ రూ.15 కోట్లకు పైగా ఉన్నట్లు అఖిలేష్‌ యాదవ్‌ వెల్లడించారు.  దీంతో ఆయన మొత్తం కుటుంబ ఆస్తులు రూ.41.88 కోట్లకు చేరాయి.

అఖిలేష్ యాదవ్ తన అఫిడవిట్‌లో తన భార్య డింపుల్ యాదవ్ తనకు రూ. 54 లక్షల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు.  అలాగే తన వద్ద 1.60 లక్షల విలువైన మట్టి, పింగాణి పాత్రలు ఉన్నట్లు వెల్లడించడం విశేషం. అఖిలేష్ చేతిలో రూ.25.61 లక్షల నగదు, రూ.5.41 కోట్ల బ్యాంకు వాల్ట్‌లు ఉన్నాయి.

లిక్విడ్ క్యాష్ రూపంలో డింపుల్ యాదవ్‌ వద్ద రూ.5.72 లక్షలు, వివిధ బ్యాంకింగ్ సంస్థల్లో రూ.3.75 కోట్లు ఉన్నాయి. ఆమె వద్ద 2.77 కేజీల బంగారంతో కూడిన రూ.59.76 లక్షల విలువైన నగలు ఉన్నాయి. ఇక అఖిలేష్ చరాస్తుల్లో రూ.9.12 కోట్లు, స్థిరాస్తుల్లో రూ.17.22 కోట్లు పెట్టుబడి పెట్టారు. కాగా, డింపుల్ చరాస్తుల విలువ 5.10 కోట్లు. ఆమెకు రూ.10.44 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)