మంత్రి సవిత Vs ఎంపీ పార్థసారథి.. మరోసారి భగ్గుమన్న విభేదాలు

Published on Sun, 11/03/2024 - 15:31

సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. రొద్దంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి సవిత ఆవిష్కరించగా, ఎంపీ బీకే పార్థసారథిని ఎందుకు ఆహ్వానించలేదంటూ ఆయన వర్గీయుల నిరసనకు దిగారు. హిందూపురం టీడీపీ ఎంపీ బీకే పార్థసారథి వర్గీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి మధ్య అధిపత్య పొరు కొనసాగుతోంది.

కాగా, పెనుకొండ నియోజకవర్గంలో అన్నింటా ఆధిపత్యం చాటుకోవాలని మంత్రి ప్రయత్నిస్తుండగా.. పట్టు నిలుపుకోవాలని బీకే వ్యూహాలు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కేడర్‌ రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఇదివరకే ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడిగానూ ఉన్న బీకే పార్థసారథిని కాదని సవిత ఎమ్మెల్యే టికెట్‌ తెచ్చుకుని గెలిచిన సంగతి తెలిసిందే.

మంత్రి పదవినీ కూడా దక్కించుకున్న సవిత.. ప్రస్తుతం ఆమె నియోజకవర్గంలో తన వర్గాన్ని బలోపేతం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం మద్యం షాపుల టెండర్లలో సైతం ఎంపీ వర్గీయులు పాల్గొనకూడదంటూ మంత్రి వర్గీయులు అడ్డుపడటంతో గతంలో  పెనుకొండ ఎక్సైజ్‌ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణ తలెత్తిన సంగతి తెలిసిందే. 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)