Breaking News

కిషన్‌రెడ్డి పార్టీకి లక్కీ హ్యాండ్‌: ధర్మపురి అర్వింద్‌

Published on Tue, 07/04/2023 - 17:40

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని నియమించడంపై నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ హర్షం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపిన అర్వింద్‌.. కిషన్‌రెడ్డి పార్టీకి ఒక లక్కీ హ్యాండ్‌ అని స్పష్టం చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ధర్మపురి అర్వింద్‌ మాట్లాడుతూ.. ‘జేపీ నడ్డా.. అజాత శత్రువు.. కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. పరిపక్వత కల్గిన పొలిటీషయన్‌ కిషన్‌రెడ్డి. ఆయన్ను నియమించినందుకు ధన్యవాదాలు. ఈటలకు ఎలక్షన్ మేనేజ​్‌మెంట్‌ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు నడ్డాకు కృతజ్ఞతలు. 2024 లో మూడోసారి ప్రధాని మోదీ పీఎం అవుతారు.

ఈటల తెలంగాణ వ్యాప్తంగా అగ్రెసివ్‌గా వెళ్తారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. బండి సంజయ్ అగ్రెసివ్‌గా తన టర్మ్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. మేమంతా కలిసి పనిచేస్తాం.. అధికారంలోకి తీసుకువస్తాం.  ఎంపీగా గెలవలేని వ్యక్తి రాహుల్.. ఆయన కూడా మాపై వ్యాఖ్యలు చేస్తాడా?, కాంగ్రెస్‌ను లేపడానికి కొన్ని ఛానళ్లు బాగా కష్ట పడుతున్నాయి. మీడియా కథనాలతో ప్రజలను మభ్యపెట్టలేరు. రాహుల్ కు రాజకీయం నేర్పేందుకు కొన్ని ఛానళ్లు క్లాసులు ఇస్తున్నాయి.

చచ్చిపోయిన పీనుగులాంటి కాంగ్రెస్ పార్టీ.. 12 వేల ఓట్లతో గెలిచిన వ్యక్తిని పార్టీలోకి చేర్చుకుంటే అధికారంలోకి వస్తుందా?,  కవిత అరెస్ట్ విషయంలో పొలిటికల్ ఇన్వాల్వ్ మెంట్ ఉండదు. తప్పు చేసిన వారిని, అవినీతి చేసిన వారిని బొక్కలో వేస్తామని మోదీ హామీ ఇచ్చారు.. కేటీఆర్ కు ఇంకా ఏం హామీ ఇవ్వాలట. కవిత జైలుకు వెళ్లేముందు ఒక్కదాన్నే వెళ్లను.. అందరినీ తీసుకు వెళ్తామని అందని చెప్తున్నారు. నాకు, బండికి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు. కవిత విషయంలో సంజయ్ కామెంట్స్ చేసినప్పుడు నా టంగ్ స్లిప్ అయి నేను కూడా కామెంట్స్ చేశా’ అని పేర్కొన్నారు.
చదవండి: బీజేపీ స్ట్రాటజీ.. తెలుగు రాష్ట్రాల బీజేపీ చీఫ్‌ల మార్పు

బీజేపీలో కిషన్‌రెడ్డి బలం అదే.. ఆయనే ఇక తెలంగాణలో పార్టీ గేమ్‌ఛేంజర్‌!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)